Smart Phone Syndrome : ఫోన్ చూస్తూ చూపు కోల్పోయింది...

Smart Phone Syndrome : ఫోన్ చూస్తూ చూపు కోల్పోయింది...
X
స్మార్ట్ ఫోన్ చూస్తూ చూపు కోల్పోయిన మహిళ; రోజుకు 8గంటలు స్మార్ట్ ఫోనే లోకం.... కళ్లు మసకబారి చివరికి....

సిగరేట్ స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం, ప్రాణాంతకం... అదేంటి.. హెడ్డింగ్ లో స్మార్ట్ ఫోన్ ఉండి ఇక్కడ సిగరేట్ ఉందనుకునేరు. సిగరేట్ లాంటిదే స్మార్ట్ ఫోన్ అని చెప్పడానికి ఆ పద ప్రయోగం.

'స్మాట్ ఫోన్' నేటి తరంలో చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ఉపయోగిస్తున్న సాధనం. ఐదేళ్ల క్రితం వరకు, పిల్లలకు అన్నం తినిపించాలంటే చందమామను చూపేవారు. ఇప్పుడు 'స్మార్ట్ ఫోన్' లో వీడియోలు చూసేవరకు పిల్లలు అన్నం తినడంలేదు. ఒక రకంగా... మారిన జీవిత ప్రమాణాల దృష్ట్యా 'స్మార్ట్ ఫోన్' కు జనాలు అడిక్ట్ అయ్యారు. విద్యార్థుల చదువులు కూడా మొబైల్ ఫోన్ పైనే ఆదారపడుతున్నారు. చదువుకోవడానికి పుస్తకాలు ఉన్నా... మోబైల్ లో పీడీఎఫ్ లు చదవడానికే ఆసక్తి చూపుతున్నారు.

డాక్టర్లు మాత్రం మొబైల్ ను ఎక్కువగా చూడడం వలన కంటిచూపు కోల్పోతున్న కేసులు ఎక్కువవుతున్నాయని అంటున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ కు చెందిన కంటి డాక్టర్ వద్దకు ఓ మహిళ కళ్లు సరిగ్గా కనపడటం లేవని వెళ్లింది. రాత్రిళ్లు దాదాపు 15నిమిషాల పాటు అందత్వం ఆవరిస్తుందని చెప్పింది. ఆవిడ దినచర్య గురించి తెలుసుకున్న డాక్టర్ షాక్ కు గురయ్యారు.

హైదరాబాద్ కు చెందిన 30 ఏళ్ల మహిళ... రోజులో 8 - 10 గంటలు స్మార్ట్ ఫోన్ ను చూడగా కంటిచూపు కోల్పోయింది. సదరు మహిళ హైదరాబాద్ లో బ్యూటీషియన్ గా పనిచేస్తుంది. తన పిల్లల బాగోగులను చూసుకోవడానికి కొంతకాలం క్రితం ఉద్యోగం మానేసింది. పిల్లల పనులు అయిపోయాక ఫోన్ చూడటం వ్యాపకంగా మారింది . ఉదయం పూట 8-10 గంటలు ఫోన్ చూసేది. రాత్రి మరో రెండు గంటలు చీకటిలో చూసేది. దీంతో ఆవిడకు రానురాను కళ్లు మసకబారడం మొదలు పెట్టాయి. అర్థరాత్రి మెలుకువ వచ్చి వాష్ రూమ్ కు వెళ్లే సమయంలో ఆవిడ చూపు దాదాపు 15నిమిషాల పాటు చీకటి ఆవరించడం మొదలు పెట్టింది. అది క్రమేణా పెరుగుతుండటంతో డాక్టర్ వద్దకు వెళ్లింది.


డాక్టర్, సదరు మహిళ దినచర్యను పరిశీలించగా స్మార్ట్ ఫోన్ ను అతిగా చూడటమే అందుకు కారణమని తేల్చారు. ఆవిడ సమస్యను సైకలాజికల్ గానే తగ్గించినట్లు చెప్పారు. పేషెంట్ కు ఎలాంటి మందులు ఇవ్వలేదని స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని తగ్గించమని సలహా ఇచ్చినట్లు తెలిపారు. అందుకు ఆవిడ అంగీకరించింది. ఒకటిన్నర నెల తర్వాత డాక్టర్ ను కలిసింది. అప్పుడు ఆవిడకు కంటిచూపు పూర్తిగా మామూలు స్థితికి చేరుకుంది.

స్మార్ట్ ఫోన్ వలన ఎందుకు కంటి సమస్యలు వస్తాయి..?

కనుబొమ్మలను తరచూ కదిలించడం, కళ్ల దృష్టిని వెలుగులో కేంద్రీకరించడంతో కళ్లు అలిసిపోతాయని, కంటిలోని నరాలు దెబ్బతింటాయని డాక్టర్లు తెలిపారు. స్క్రీన్ వేడిని ఉత్తత్తి చేస్తుందని ఆవేడి వలన కళ్లు దెబ్బతింటాయని చెప్పారు. స్మార్ట్ ఫోన్ కు బానిసలైన చాలామందికి తగినంత నిద్ర ఉండక పోవడం వలన కూడా కంటి సమస్యలు మరింత ఎక్కువ అవుతాయని తెలిపారు. దీంతో స్వల్పమైన అందత్వం వస్తుందని అలాగే స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువచేస్తూ పోతే పూర్తి అందత్వం రావొచ్చని అంటున్నారు.

ఇందుకు నివారణ స్క్రీన్ సమయాన్ని తగ్గించడం ఒక్కటే... ఉపాయమని డాక్టర్లు స్పష్టం చేశారు.

Tags

Next Story