Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ పాములు
బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికుల వద్ద విషపూరితమైన పాములు బయటపడడం కలకలం సృష్టించింది. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఇలా పాములు లభ్యమయ్యాయి. తనిఖీల్లో పాములను కస్టమ్స్ అధికారులు గుర్తించిన విషయం తెలిసి బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ ప్రయాణించిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ప్రయాణ సమయంలో బ్యాగుల్లోని పాములు బయటికొస్తే తమ పరిస్థితి ఏంటి అని వారు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ విషపూరితమైన పాములను బ్యాంకాక్ నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. పాముల సరఫరా వెనుక ఏదైనా కుట్ర దాగుందా? అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. ఇక ప్రయాణికుల వద్ద దొరికిన ఆ పాములను అనకొండలుగా అధికారులు గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com