Harish Rao : అవసరంలేకున్నా కొందరు డాక్టర్లు సిజేరియన్ డెలివరీలు చేస్తున్నారు : మంత్రి హరీష్‌

Harish Rao :  అవసరంలేకున్నా కొందరు డాక్టర్లు సిజేరియన్ డెలివరీలు చేస్తున్నారు : మంత్రి హరీష్‌
X
Harish Rao : నర్సింగ్‌ కోర్సు వల్ల తెలంగాణ విద్యార్థులు అంతర్జాతీయంగా సత్తా చాటుతున్నారన్నారు మంత్రి హరీష్‌ రావు.

Harish Rao : నర్సింగ్‌ కోర్సు వల్ల తెలంగాణ విద్యార్థులు అంతర్జాతీయంగా సత్తా చాటుతున్నారన్నారు మంత్రి హరీష్‌ రావు. కామారెడ్డి జిల్లా దుర్కిలోని నర్సింగ్‌ కాలేజీ నిర్మాణానికి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. 40 కోట్లతో నిర్మించనున్న కాలేజీకి భూమి పూజ చేశారు. రాష్ట్రంలోనే బాన్సువాడ ఆస్పత్రికి నార్మల్‌ డెలివరీల్లో ప్రథమస్థానం దక్కిందని కొనియాడారు. అవసరం లేకున్నా... కొందరు డాక్లర్టు సిజేరియన్‌ చేస్తున్నారని... నార్మల్‌ డెలివరీలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక గత పాలకుల వల్ల సాగు నీటి కోసం రైతులు అనేక అవస్థలు పడ్డారని... టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించి... రైతులకు పెద్దపీఠ వేస్తుందన్నారు మంత్రి హరీష్‌ రావు.

Tags

Next Story