తెలంగాణ

Nagarkurnool: టోల్‌ప్లాజా వద్ద యువకుల వీరంగం.. సిబ్బందిపై దాడి..

Nagarkurnool: నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కోనేటిపురం టోల్‌ప్లాజాలో యువకులు వీరంగం సృష్టించారు.

Nagarkurnool: టోల్‌ప్లాజా వద్ద యువకుల వీరంగం.. సిబ్బందిపై దాడి..
X

Nagarkurnool: నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కోనేటిపురం టోల్‌ప్లాజాలో యువకులు వీరంగం సృష్టించారు. రెండు కార్లు శ్రీశైలం నుంచి ప్రధాన రహదారిలో కోనేటిపూర్ టోల్‌ప్లాజా వద్దకువచ్చి సైరన్ మోగించాయి. అందులో ఒక ముందుకుపోగా.. మరొకటి టోల్ ప్లాజా ఎగ్జిట్‌ ను విరగొట్టింది. దీంతో టోల్ ప్లాజా సిబ్బంది వారిని నిలదీయడంతో.. యువకులు సిబ్బందిపై విరుచుకుపడి.. చితకబాదారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. టోల్ ప్లాజా సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES