ఈటల రాజేందర్‌పై వచ్చిన ఆరోపణల్లో కొంత నిజం ఉంది: మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్

Etela Rajender (File Photo)
ఈటల రాజేందర్‌పై వచ్చిన ఆరోపణల్లో కొంత నిజం ఉందన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్. కొంత అసైన్డ్ భూమి కబ్జాకు గురైంది నిజమేనన్నారు. ఇంకా సర్వే జరుగుతోందని, అది పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అచ్చంపేటకు వెళ్లిన జిల్లా కలెక్టర్.. రైతులతో మాట్లాడి, సర్వే పనులను పరిశీలించారు.
అటు విజిలెన్స్, రెవెన్యూ అధికారులు సైతం రంగంలోకి దిగారు. విజిలెన్స్ డీజీ పూర్ణచందర్‌రావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మాసాయిపేట మండలం అచ్చంపేటలో విజిలెన్స్ ఎస్పీ మనోహర్ నేతృత్వంలో రైతుల నుంచి వివరాలు సేకరణ జరిగింది. ఆర్డీవో ప్రకాశ్ ఆధ్వర్యంలో మూడు టీమ్‌లు డిజిటల్ సర్వే చేస్తున్నాయి. ఒక్కో టీమ్‌లో ముగ్గురు తహశీల్దారులతో పకడ్బందీగా సర్వే చేస్తున్నారు. మొత్తం 170 ఎకరాల భూమిని జెట్ స్పీడ్‌తో సర్వే చేస్తున్నారు రెవెన్యూ అధికారులు.
మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామ శివారులో ఉన్న సర్వే నెంబర్ 130, సర్వే నెంబర్ 111, సర్వే నెంబర్ 81లో 170 ఎకరాల భూమిని మూడు టీమ్‌లుగా ఏర్పడి సర్వే చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com