Khammam: ధాన్యం కాపాడుకోవడానికి వెళ్లి ప్రాణం కోల్పోయాడు..

Khammam: ధాన్యం కాపాడుకోవడానికి వెళ్లి ప్రాణం కోల్పోయాడు..
Khammam: తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Khammam: తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పంట చేతికి వచ్చిన రైతులు అటు.. ధాన్యం అమ్ముడుపోక.. ఇటు వర్షాల నుండి వాటిని కాపాడుకోలేక చాలా కష్టపడుతున్నారు. తాజాగా వర్షంలో ధాన్యం తడవకూడని తన కొడుకుతో బయల్దేరాడు ఓ రైతు. కానీ అనుకోకుండా అక్కడే ఆ కొడుకు ప్రాణం పోయింది.

ఖమ్మం జిల్లా వేంసూరులో కొన్నిరోజుల నుండి అకాల వర్షాలు పడుతున్నాయి. దీంతో యాసంగి పంట మొత్తం నీటిపాలు అవుతోంది. తాజాగా ఓ రైతు తన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించాడు. తరలించిన తర్వాత వర్షం పడడంతో ధాన్యాన్ని కాపాడుకోవడానికి తన కొడుకును వెంటబెట్టుకొని వెళ్లాడు. అక్కడే విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.

బూరుగు ఏసురత్నం తన కొడుకు విద్యాసాగర్‌తో కలిసి వర్షం నుండి ధాన్యాన్ని కాపాడుకోవడం కోసం ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లాడు. కానీ అక్కడ ధాన్యానికి పట్టాలు కప్పే క్రమంలో విద్యాసాగర్‌పై పిడుగుపడడంతో తను అక్కడికక్కడే మరణించాడు. కళ్ల ముందే కొడుకు మరణాన్ని చూసిన ఏసురత్నం విలవిలలాడిపోయాడు. విద్యాసాగర్ పశువైద్యంలో డిప్లొమా పూర్తిచేశాడు.

Tags

Read MoreRead Less
Next Story