కల్తీ ఐస్‌క్రీం గోదాంలపై ఎస్‌ఓటీ దాడులు

కల్తీ ఐస్‌క్రీం గోదాంలపై ఎస్‌ఓటీ దాడులు
హైదరాబాద్‌ చందానగర్‌లో నాసిరకం ఐస్ క్రీం తయారీ కేంద్రంపై SOT పోలీసులు దాడులు నిర్వహించారు

హైదరాబాద్‌చందానగర్‌లో నాసిరకం ఐస్ క్రీం తయారీ కేంద్రంపై SOT పోలీసులు దాడులు నిర్వహించారు. బ్రాండెడ్‌ కంపెనీల లేబుళ్లతో ఐస్‌క్రీం, కుల్ఫీలను తయారు చేసి అమ్ముతున్నారు. అయితే ఈ ఫ్యాక్టరీ యజమానులు ఐస్‌ క్రీం తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. ప్రమాదకరమైన రసాయనాలు వాడుతూ ఐస్‌క్రీములు తయారుచేస్తున్నారు. చందానగర్‌లో కల్తీ ఐస్‌క్రీం తయారు చేసే గోదాంలపై ఎస్ఓటి పోలీసులు చేసిన దాడుల్లో ఐస్‌ క్రీం తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని,ఎలాంటి అనుమతులు లేకుండానే తయారు చేస్తున్నారని గుర్తించారు. గత ఐదేళ్లగా నాసిరకం ఐస్‌క్రీంలను అమ్ముతున్నాడు శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి. అతనికి చెందిన గోదాములో దాదాపు 10 లక్షల విలువైన ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు SOT పోలీసులు.

Tags

Next Story