Trains Cancelled: తెలుగు రాష్ట్రాలలో నేడు-రేపు నడపవలసిన మరో 20 రైళ్ళను రద్దు..
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా మరికొన్ని రైళ్లు రద్దయ్యాయి. 28 రైళ్లను రద్దు చేయగా, కొన్నింటిని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు సీపీఆర్వో శ్రీధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. వర్షాల కారణంగా సోమవారం వరకు 496 రైళ్లు రద్దు కాగా.. 152 సర్వీసులను దారి మళ్లించారు. తాజాగా 28 రైళ్లు రద్దు చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తూ వస్తుంది.. కొన్ని రైళ్లను రద్దు చేస్తే.. మరికొన్ని సర్వీసులను దారి మళ్లిస్తుంది.. ఇంకా కొన్ని రైళ్లను తాతాల్కికంగా రద్దు చేసింది.. అయితే, తెలుగు రాష్ట్రంలో ఇవ్వాళ, రేపు నడపవలసిన మరో 20 రైళ్ళను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలలో 544 ట్రైన్ లను భారీ వర్షాల కారణంగా రద్దు అయినట్లు సమాచారం. తాజాగా మరో 20 రైళ్ళను రైల్వే అధికారులు దారి మళ్లించినట్లు తెలిపారు.
దీంతో ఇప్పటివరకు 187 రైళ్ళను పైగా దక్షిణ మధ్య రైల్వే దారి మళ్లించినట్లు వెల్లడించారు. తాత్కాలికంగా మూడు రోజుల్లో 20కి పైగా రైళ్ళను రద్దు చేసినట్లు ప్రకటించారు. నిన్నటి వరకు తాత్కాలికంగా రద్దు చేసిన రైళ్లలో ఉన్న దాదాపుగా 10 వేలమంది ప్రయాణికులను ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం ద్వారా వారి వారి గమ్యస్థానాలకు చేర్చారు. తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీ అధికారుల సమన్వయంతో 158 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కాజీపేట నుండి దానాపూర్, బెంగళూరు.. విజయవాడ నుండి చెన్నై, విశాఖపట్నం వరకు ప్రయాణికులు రవాణా చేయడానికి ఐదు ప్రత్యేక రైళ్లను నడిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com