Pocharam Srinivas Reddy: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్.. ఆస్పత్రిలో చేరిక

X
By - Prasanna |25 Nov 2021 1:07 PM IST
Pocharam Srinivas Reddy: సాధారణ పరీక్షల్లో భాగంగా బుధవారం రాత్రి కరోనా టెస్ట్ చేయగా అందులో కరోనా పాజిటివ్ నిర్ణారణ అయింది.
Pocharam Srinivas Reddy: తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. సాధారణ పరీక్షల్లో భాగంగా బుధవారం రాత్రి కరోనా టెస్ట్ చేయగా అందులో కరోనా పాజిటివ్ నిర్ణారణ అయింది. దీంతో ఆయన గురువారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అయితే తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనప్పటికీ వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరినట్లు ఆయన తెలిపారు.
కాగా, ఇటీవల పోచారం మనవరాలి పెళ్లికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు, పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని మంత్రి సూచించారు. తగిన జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని స్పీకర్ సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com