తెలంగాణ

TSRTC : కొత్త సంవత్సరం రోజున పిల్లల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బహుమతి..!

TSRTC : కొత్త సంవత్సరం రోజున పిల్లల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బహుమతిని ప్రకటించింది. జనవరి,1వ తేదీన 12 సంవత్సరాలోపు పిల్లలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే సదుపాయాన్ని ఆర్టీసి కల్పించింది.

TSRTC : కొత్త సంవత్సరం రోజున పిల్లల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బహుమతి..!
X

TSRTC : కొత్త సంవత్సరం రోజున పిల్లల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బహుమతిని ప్రకటించింది. జనవరి,1వ తేదీన 12 సంవత్సరాలోపు పిల్లలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే సదుపాయాన్ని ఆర్టీసి కల్పించింది. ఈమేరకు ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రకటన విడుదల చేశారు. కొత్త సంవత్సరం రోజున పిల్లలు తమ పేరెంట్స్‌తో కలిసి ఆర్టీసీ బస్సులో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే.. గ్రేటర్‌ పరిధిలోని ఎంపిక చేసిన 15 రూట్లలో.. ఇవాళ అర్ధరాత్రి పన్నెండున్నర గంటల నుంచి రేపు తెల్లవారుజామున 3గంటల వరకూ ప్రత్యేక సిటీ బస్సులు నడుస్తాయని ఎండీ పేర్కొన్నారు. చార్జీ 100 చెల్లించాల్సి ఉంటుందన్నారు.

Next Story

RELATED STORIES