ఆమెకు ఫ్రీ.. మాకు సీటేది: పురుషుల కోసం ఆర్టీసీ కొత్త యోచన

ఆమెకు ఫ్రీ.. మాకు సీటేది: పురుషుల కోసం ఆర్టీసీ కొత్త యోచన
తెలంగాణ సీఎం రేవంత్ పగ్గాలు చేపట్టిన మరుక్షణమే మహాలక్ష్మీ పథకం అమల్లోకి వచ్చింది.

తెలంగాణ సీఎం రేవంత్ పగ్గాలు చేపట్టిన మరుక్షణమే మహాలక్ష్మీ పథకం అమల్లోకి వచ్చింది. దానిలో ఉన్న సాధ్యాసాధ్యాలను గమనించుకోకుండానే అమలు చేసిన పథకంతో రాష్ట్రం ఆగమాగమైతుంది. క్కిక్కిరిసిన బస్సులు, కనీసం నిలబడడానికి కూడా చోటు లేకుండా ఉంటున్నాయి. ఇక విద్యార్ధులు, పురుషుల సంగతి అయితే చెప్పనక్కరలేదు.

మహిళలకేనా మాకు లేదా ఉచిత ప్రయాణం అంటూ పురుషులు గొడవకు దిగుతున్నారు. అసలే ఓలా ఆటో వచ్చి మా కడుపు కొట్టింది. ఇప్పుడు తీసుకు వచ్చిన ఉచిత ప్రయాణం వల్ల వచ్చే నాలుగు పైసలు కూడా పోయాయని ఆటో డ్రైవర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పురుషుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడపాలనుకుంటోంది టీఎస్ఆర్టీసీ.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చాక ఆక్యుపెన్సీ రేషియో పెరిగినట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. గతంలో 69 శాతం ఉండేది. అది ఇప్పుడు దాదాపు 89 శాతం నమోదవుతోంది. ఉన్న బస్సులతో అంత రద్దీని తట్టుకోవడం ఆర్టీసీకి సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితుల్ని డ్రైవర్లు, కండక్టర్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు వివరించారు. దీంతో ఆయా అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు.

రద్దీపై సమగ్ర సమాచారం అందుకున్నాక పురుషులకు, విద్యార్థులకు ప్రత్యేక బస్సులు నడపడంపై ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్నారు. ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా పలురకాల ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారి వివరించారు.

Tags

Next Story