మనుషులా.. మృగాలా.. మనసెలా ఒప్పింది

మనుషులా.. మృగాలా.. మనసెలా ఒప్పింది
X

మనుషులా.. మృగాలా.. మనసెలా ఒప్పింది

దేవుడు వాళ్లకి మనసనేది ఇవ్వలేదా..

మరి వాళ్లనెందుకు సృష్టించాడు..

నిజానికి మనిషిని మృగంతో పోలుస్తాం

కాని అవెంత బాధపడతాయో ఆ విషయం వాటికి తెలిస్తే.. ఆకలేస్తేనే వేటాడతాయి..

అయినా దేవుడు మనిషికి కళ్లు, కాళ్లు, చేతులు, ఆలోచించే శక్తిని ఇచ్చాడు..

కష్టపడి సంపాదించుకుని బతకమని..

అయినా మృగాల్లా ప్రవర్తిస్తున్నారు..

మానవత్వం మచ్చుకైనా కనిపించట్లేదు..

అన్యాయంగా అభం శుభం తెలియని బాలుడిని చంపి ఆ డబ్బుతో ఏం చేద్దామనుకున్నారు..

తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చిన దుర్మార్గులు కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా..

మనసుల్లో ఇంత ద్వేషాన్ని పెంచుకుని ఎలా మనుగడ సాగిద్దామనుకుంటున్నారు.

దేవుడా.. ఈ లోకాన్ని రక్షించు..

కామాంధుల నుంచి.. నరహంతకుల నుంచి.. నయవంచకుల నుంచి..

లేకపోతే మనిషనే వాడిని సృష్టించడం మానెయ్ స్వామీ.

Tags

Next Story