MLC Dasoju : చేతకాకపోతే తప్పుకో.. రేవంత్‌పై ఎమ్మెల్సీ దాసోజు ఫైర్

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎనుముల రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలోతొక్కి వారికి నచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై 5 వేల కేసులు పెట్టారని అన్నారు. ఒక టీవీ ఛానల్‌పై దాడి చేశారనే కేసులో గెల్లు శ్రీనివాస్ యాదవ్ భార్యను ఏ25గా చేర్చారని తెలిపారు. స్టేషన్‌కు రావాలంటూ ఆమెను పోలీసులు బెదిరిస్తున్నారని.. ఇది ఎంత వరకు కరెక్ట్ అని దాసోజు ప్రశ్నించారు.
రాష్ట్రంలో నిరసన తెలపడానికి కూడా హక్కు లేకుండా పోయిందని శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రేవంత్ రెడ్డికి ఏం పని అని అడిగారు. హోంశాఖపై రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రివ్యూ చేయలేదని.. ఆయనకు చేతకాకపోతే హోంశాఖను వేరేవారికి అప్పగించాలని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ పేరుతో నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ నడిపిస్తున్నారని సెటైర్ వేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com