టీఆర్‌ఎస్ నుంచి నన్నెందుకు బయటికి పంపించారో ఇప్పటికీ సమాధానం లేదు : ఎమ్మెల్యే రఘునందన్‌రావు

X
తనను టీఆర్‌ఎస్ నుంచి ఎందుకు బయటికి పంపించారో ఇప్పటికీ సమాధానం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. ఇక సమాధానం వస్తుందని అనుకోవడం లేదన్నారు. బీజేపీలో చేరిన తనను పార్టీ ఆదరించి.. పోటీ చేసే అవకాశం ఇచ్చిందన్నారు. టీఆర్‌ఎస్‌లో ఉండి అవమానాలకు గురువుతున్న వారు బీజేపీలో రావాలని విజ్ఞప్తి చేశారు. అలాంటి నేతలు 40 మంది వరకు ఉన్నారన్నారు. తనపై పెట్టిన కేసులనుండి ధర్మబద్ధంగా బయటపడుతానన్నారు. గ్రేటర్‌లో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తామని తమ టార్గెట్ ప్రతిబూత్‌లో 51 శాతం ఓట్లేనన్నారు. దుబ్బాక స్పూర్తిని గ్రేటర్ కార్యకర్తలు తీసుకుని పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
