V Hanumantha Rao : వీహెచ్‌ ఇంటిపై అర్ధరాత్రి దుండగుల దాడి.. కారు ధ్వంసం..!

V Hanumantha Rao : వీహెచ్‌ ఇంటిపై అర్ధరాత్రి దుండగుల దాడి.. కారు ధ్వంసం..!
X
V Hanumantha Rao : కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హెచ్‌ ఇంటిపై అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.

V Hanumantha Rao : కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హెచ్‌ ఇంటిపై అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఇంటి ముందు ఉంచిన కారును ధ్వంసం చేశారు. బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానన్నారు వీ.హెచ్‌. ఈ దాడి వెనుక ఎవరున్నారో పోలీసులు కనిపెట్టాలని కోరారు. మాజీ పీసీసీగా, మంత్రిగా పని చేసిన తనకు కనీస రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. గతంలో బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు డీజీపీకి ఫిర్యాదు చేశానని...కానీ ఇప్పటివరకూ పరిష్కారం చూపలేదన్నారు. ప్రొటెక్షన్‌ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. దీనిపైన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story