TS Lockdown : సీఎం కేసీఆర్ ఆదేశాలతో గ్రేటర్ లో కఠినంగా లాక్ డౌన్..!

TS Lockdown : తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. గ్రేటర్ హైదరాబాద్ లో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. ఉదయం 10 గంటల తర్వాత ఎవరు బయట తిరగకూడదని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. పాసులు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ప్రతి ఒక్క వాహనాన్ని అపుతున్న పోలీసులు.. అనుమతి ఉంటేనే పంపిస్తున్నారు. లాక్ డౌన్ అమలును డీజీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు. కూకట్ పల్లిలో ఆకస్మిక తనిఖీలు చేశారు. పంజాగుట్ట, బంజారాహిల్స్, బేగంపేటలో హైదరాబాద్ సిటీ అంజనీకుమార్ లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించారు. చిలకలగూడ, బోయిన్ పల్లి, మారేడ్పల్లి, ఖర్ఖనా వద్ద పోలీసులు ప్రధాన రోడ్లపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అనుమతి లేకుండా బయటకు వచ్చిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాహనాలను తనిఖీ చేసిన తర్వాతే అనుమతి ఇస్తున్నారు. దీనితో బేగంపేట్ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com