Banjara Hills: మాల్‌లో ప్రమాదం.. ఎస్కలేటర్ నుంచి జారిపడి విద్యార్థులకు గాయాలు..

Banjara Hills: హైదరాబాద్ బంజారాహిల్స్ సినిమాక్స్ ఎస్కలేటర్‌పై జరిగిన ప్రమాదంలో 12 మంది విద్యార్థులు, ఓ టీచర్‌కు గాయాలయ్యాయి. వారిని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇందులో 8 మంది విద్యార్థులు, టీచర్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు పంపించారు. నలుగురు విద్యార్థులను ఆడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థి క్రితిన్ తలకు తీవ్ర గాయమవడంతో ఐసీయూలో ఉంచారు. స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా భారతీయ విద్యాభవన్ స్కూల్ విద్యార్థులు.. గాంధీ సినిమా కోసం సినీమాక్స్ వెళ్లినపుడు ఈ ఘటన చోటు చేసుకుంది.
స్పీడ్‌గా వెళ్తున్న ఎస్కలేటర్ పైనుంచి విద్యార్థులు జారిపడ్డారు. అటు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మేయర్ గద్వాల విజయలక్ష్మీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. గాయపడిన విద్యార్థులకు అందుతున్న చికిత్సను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తొమ్మిది మందికి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిపోయినట్లు మంత్రి తెలిపారు. నలుగురు చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎవరికి ఎలాంటి ప్రాణహాని లేదన్న మంత్రి.. ప్రభుత్వం అన్నిచర్యలు చేపట్టిందని తెలిపారు. విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని వైస్ ప్రిన్సిపాల్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com