Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్ధి పరిస్థితి విషమం.. ఆందోళనకు దిగిన స్టూడెంట్స్..

Nizamabad : బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్‌పాయిజన్‌తో ఆసుపత్రిలో చేరినవారంతా కోలుకుంటున్నారు. శుక్రవారం ఫుడ్‌పాయిజనింగ్‌తో..వందలమంది ఆసుపత్రి పాలయ్యారు. కొందరిని నిజామాబాద్, నవీపేటలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో, ఇంకొందరిని ట్రిపుల్ ఐటీలోని ఆస్పత్రిలో చేర్చారు. అయితే చికిత్స అనంతరం హాస్టళ్లకు పంపించేశారు. ప్రస్తుతం నిజామాబాద్ హాస్పిటల్‌లో నలుగురు చికిత్స పొందుతున్నారు. కోమలి అనే విద్యార్థిని పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు విద్యార్ధులు. నాసిరకం సరుకులు వాడటం వల్లనే ఫుడ్ పాయిజనింగ్ అయిందంటూ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ముందు నిరసన తెలిపారు. గడువు తీరిన వంట సరుకులు, కుళ్లిన కోడిగుడ్లు, నూనె ప్యాకెట్లతో నిరసన తెలిపారు స్టూడెంట్స్. మెస్ కాంట్రాక్టు సంస్థలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యలైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధులను పరామర్శించారు సీపీఐ నేత నారాయణ. విద్యార్ధుల అస్వస్థతకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెస్ నిర్వహణలోనే లోపాలున్నాయన్న ఆయన.... వెంటనే మెస్ కాంట్రాక్టను రద్దు చేయాలన్నారు.
NSUI స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్.... విద్యార్థులను పరామర్శించారు. వంటలో నాసిరకం నూనె వాడడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. మెస్ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోదాకు తరలించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఏదైనా జరిగితే భౌతిక దాడులకు సైతం సిద్ధమని ప్రకటించారు
పుడ్ పాయిజన్ ఘటనపై స్పందించారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్. తెలంగాణ విద్యా శాఖ మంత్రి విద్యార్థుల సంక్షేమంపై కాకుండా ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ట్వీట్ చేశారు. తెలంగాణను పట్టించుకోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు.
అటు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ట్రిపుల్ ఐటీ విద్యార్థులను పరామర్శించారు. యూనివర్శిటీలను కేసీఆర్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. గతంలో సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన స్పందించలేదన్నారు. విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com