గురునానక్ ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద ఉద్రిక్తత

గురునానక్ ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద ఉద్రిక్తత


రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించానలి విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతగా మారింది. విద్యార్థులు ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై వెంకట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు కట్టిన ఫీజులు చెల్లించడంతో పాటు సర్టిఫికేట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కళాశాల ముందు ధర్నాకు దిగారు. కళాశాల గేటు దూకి లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. మరోవైపు ఆదిభట్ల సీఐ రవికుమార్‌ అస్వస్థతకు గురయ్యారు. ఇక వీరందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు విద్యార్థులు కళాశాలలోకి ప్రవేశించి అద్దాలను ధ్వంసం చేశారు.

Tags

Next Story