TG: తెలంగాణ పోలీస్ శాఖలో ఆత్మహత్యల కలకలం

TG: తెలంగాణ పోలీస్ శాఖలో ఆత్మహత్యల కలకలం
X
బలవన్మరణాలకు పాల్పడుతున్న రక్షకభటులు... పని ఒత్తిడే కారణమంటూ ఆరోపణలు

తెలంగాణ పోలీస్ శాఖలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. కానిస్టేబుల్, ఎస్సై స్థాయి ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పని ఒత్తిడి, వ్యక్తిగత కారణాలు, ఉన్నతాధికారుల వేధింపులు... కారణాలు ఏమైనా కింది స్థాయి ఉద్యోగుల బలైపోతున్నారు. ప్రజా రక్షణలో ముందుండే పోలీసులు గుండె చెదిరి నిలువునా ఉసురు తీసుకుంటున్న ఉదంతాలు కలకలం రేపుతున్నాయి. ఈ ఆత్మహత్యలు పోలీస్ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

వరుస ఆత్మహత్యలు

వరుస ఆత్మహత్యల నేపథ్యంలో పోలీసులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే అవగాహన సదస్సులు పెట్టించాలని పోలీస్ శాఖలో కొందరు సూచిస్తున్నారు. పని ఒత్తిడి, ఆఫీసర్లు, సిబ్బంది మధ్య కో ఆర్డినేషన్, ఆర్థిక ఇబ్బందులు, పర్యవేక్షణపై పర్సనాలిటీ డెవలప్మెంట్ పై పలు సూచనలు ఇవాలని కోరుతున్నారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని, సమస్యలుంటే పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు ధైర్యం ఇచ్చే పోలీసులు...సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కోల్పోవడం వాస్తవ పరిస్థితులకు అద్ధం పడుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పని ఒత్తిడే కారణమా...?

ఇటీవల టీజీఎస్పీ పోలీసుల ఆందోళనలు చేశారు. సెలవుల విషయంలో ప్రభుత్వం తెచ్చిన సర్కులర్ పోలీసుల ఆగ్రహానికి కారణమైంది. ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని పోలీసులు రోడ్డెక్కారు. స్పెషల్ పోలీస్ బృందాల్లో క్షేత్రస్థాయి పనిచేసే వారి సంఖ్యను పెంచాలని, వారికి సెలవుల విధానాన్ని పునర్వ్యవస్థీకరించాలని ఈ ఏడాది అక్టోబర్ 10న ప్రభుత్వం ఓ సర్క్యులర్ జారీ చేసింది. గతంలో ఉన్న 15 రోజులకు నాలుగు రోజుల సెలవు విధానానికి బదులుగా ఒక నెలలో వరుసగా 26 రోజులు డ్యూటీలు చేయాల్సి ఉంటుందని సర్క్యులర్ లో పేర్కొన్నారు. అవసరమైతే అదనంగా మరికొన్ని రోజులు కూడా విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సర్క్యులర్‌ను వ్యతిరేకిస్తూ టీజీఎస్పీ సిబ్బంది ఆందోళన చేశారు. చివరకు ప్రభుత్వం ఈ సర్క్యులర్ ను వెనక్కి తీసుకుంది.

Tags

Next Story