Suicide: అన్నం పెట్టింది... గోదాట్లోకి నెట్టింది...

అమ్మ గోదావరి గట్టు దగ్గరకు తీసుకువెళుంటే సంబరపడ్డారు. కడుపు నిండా అన్నం పెడుతుంటే ఆబగా తిన్నారు. తీరా అక్కున చేర్చుకుని గుండెలకు హత్తుకోవాల్సిన ఆ చేతులే కర్కశంగా నీట ముంచేసరికి ఆ పసి కూనలకు ఏమీ అర్ధంకాలేదు. అమ్మే ఇలా ఉసురుతీస్తోందని తెలిసేలోగానే ఆ పసి ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. చివరకి ఆ తల్లి కూాడా గోదారిలో మునిగి ప్రాణాలు తీసుకుంది. ఈ హృదయవిదాకర ఘటన నిర్మాల్ జిల్లా బాసరలో చోటుచేసుకుంది.
మానస(27) అనే మహిళ తన ఇద్దరు చిన్నారులు బాలాదిత్య(8), నవశ్రీ(7)తో కలసి గంగా హారతి ఘాట్ వద్ద గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘాట్ వద్ద స్కూల్ బ్యాగ్ లు, ఖాళీ టిఫిన్ బాక్సులు కనిపించడంతో నీళ్లలోకి తోసే ముందు పిల్లలిద్దరికీ అన్నం పెట్టినట్లు తెలుస్తోంది.
సదరు మహిళ చిన్నారులతో కలసి నిజామాబాద్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. గోదావరి బ్రిడ్జ్ వద్ద దిగిన ఆమె నేరుగా చెరువు గట్టువద్దకు చేరుకుందని పోలీసులు భావిస్తున్నారు.
ముగ్గురు మృతదేహాలను వెలికితీసిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యప్తు ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com