కొలిక్కి వచ్చిన టీవీ నటి శ్రావణి సూసైడ్ కేసు

టీవీ నటి శ్రావణి సూసైడ్ కేసు కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డి ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించిన పోలీసులు అనేక అంశాలపై క్లారిటీకి వచ్చారు. ఈ కేసులో A1, A2 ఎవరనేది కాసేపట్లో తేల్చనున్నారు. దేవరాజ్‌రెడ్డి పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే శ్రావణి సూసైడ్ చేసుకున్నట్టు ఓ నిర్థారణకు వచ్చినట్టు తెలుస్తున్నా.. అధికారికంగా ఇంకా దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు.
దేవరాజ్, సాయి మధ్య గొడవకు దారి తీసిన పరిస్థితులపై లోతైన దర్యాప్తులో అనేక విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో ఇద్దరినీ అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు, ఇవాళ విచారణకు రావాలని నిర్మాత అశోక్‌రెడ్డిని సమాచారం ఇచ్చారు. అతనితో కూడా మాట్లాడక శ్రావణి విషయంలో గొడవలకు కారణం ఏంటనే దానిపై పూర్తి స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com