SUCIDES: విద్యార్థులూ.. చదువొక్కటే మార్గం కాదు

SUCIDES: విద్యార్థులూ.. చదువొక్కటే మార్గం కాదు
X
ఇంటర్ ఫలితాల తర్వాత 15మంది ఆత్మహత్య.. వరుస ఆత్మహత్యలతో తీవ్ర ఆవేదన.. చదువొక్కటే మార్గం కాదంటున్న నిపుణులు

తె­లం­గా­ణ­లో ఇం­ట­ర్మీ­డి­య­ట్ ఫలి­తాల వి­డు­దల తర్వాత నె­ల­కొ­న్న పరి­స్థి­తు­లు సమా­జా­న్ని కల­చి­వే­స్తు­న్నా­యి. వి­ద్యా­ర్థుల భవి­ష్య­త్తు­కు దారి చూ­పా­ల్సిన పరీ­క్ష­లు, కొం­ద­రి ప్రా­ణా­ల­ను బలి తీ­సు­కుం­టు­న్నా­య­న్న వా­స్త­వం ఆం­దో­ళన కలి­గి­స్తోం­ది. ఫలి­తా­లు ఆశిం­చిన వి­ధం­గా రా­క­పో­వ­డం­తో తీ­వ్ర మన­స్తా­పా­ని­కి గు­ర­వు­తు­న్న వి­ద్యా­ర్థు­లు ఆత్మ­హ­త్య­ల­కు పా­ల్ప­డు­తు­న్న ఘట­న­లు వరు­స­గా వె­లు­గు­లో­కి వస్తు­న్నా­యి. గత మూడు రో­జు­ల్లో­నే రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా మొ­త్తం 13 మంది వి­ద్యా­ర్థు­లు ప్రా­ణా­లు తీ­సు­కో­వ­డం పరి­స్థి­తి ఎంత వి­ష­మం­గా మా­రిం­దో సూ­చి­స్తోం­ది. తా­జా­గా సం­గా­రె­డ్డి జి­ల్లా­కు చెం­దిన రమే­ష్, నం­ది­ని, ని­ర్మ­ల్ జి­ల్లా­లో­ని మణి­వ­ర్ధ­న్, భూ­క్యా ఆకా­ష్, అలా­గే సి­ద్ది­పేట జి­ల్లా­కు చెం­దిన పొ­ట్ల ప్ర­త్యూ­ష­లు ఆత్మ­హ­త్య­ల­కు పా­ల్ప­డిన ఘట­న­లు తీ­వ్ర వి­షా­దా­న్ని మి­గి­ల్చా­యి. చదు­వు­లో వె­ను­క­బ­డ్డా­మ­నే భావన, ఫలి­తాల కా­ర­ణం­గా సమా­జా­ని­కి ఎలా ఎదు­ర­వు­దా­మ­న్న ఆం­దో­ళన వీ­రి­ని ఈ దా­రుణ ని­ర్ణ­యా­ని­కి దా­రి­తీ­సి­న­ట్లు తె­లు­స్తోం­ది. ఈ సం­ఘ­ట­న­ల­తో ఆయా ప్రాం­తా­ల్లో వి­షాద వా­తా­వ­ర­ణం నె­ల­కొం­ది.

ఇదే తరహా ఘటనలు ఇటీవల మరికొన్ని చోట్ల కూడా చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లోని వారసిగూడకు చెందిన కళ్యాణి, నాచారానికి చెందిన లక్ష్య, మెదక్ జిల్లాకు చెందిన సాయిరాం, ఉట్నూర్ ప్రాంతానికి చెందిన సౌజన్య, భూత్పూర్ మండలానికి చెందిన శ్రావణి, సూర్యాపేట జిల్లాకు చెందిన మరో సౌజన్య, రంగారెడ్డి జిల్లాకు చెందిన అభియాదవ్ వంటి విద్యార్థులు కూడా ఇదే కారణాలతో తమ ప్రాణాలను తీసుకున్నారు. ఒక్కో కు­టుం­బం తమ పి­ల్ల­ల­ను కో­ల్పో­యి తీ­వ్ర వి­షా­దం­లో ము­ని­గి­పో­గా, గ్రా­మా­లు, కా­ల­నీ­లు దుః­ఖ­సా­గ­రం­లో ము­ని­గి­పో­యా­యి. ఈ పరి­ణా­మా­ల­పై వి­ద్యా­వే­త్త­లు, మనో­వై­ద్య ని­పు­ణు­లు తీ­వ్ర ఆం­దో­ళన వ్య­క్తం చే­స్తు­న్నా­రు. పరీ­క్షల ఫలి­తా­లు జీ­వి­తా­న్ని ని­ర్ణ­యిం­చే ఏకైక ప్ర­మా­ణం కా­ద­ని వారు స్ప­ష్టం చే­స్తు­న్నా­రు. ఒక­సా­రి వి­ఫ­ల­మై­తే అంతే అన్న భా­వ­న­ను వి­ద్యా­ర్థు­లు వి­డి­చి­పె­ట్టా­ల­ని, భవి­ష్య­త్తు­లో మరి­న్ని అవ­కా­శా­లు ఉన్నా­య­ని గు­ర్తు­చే­స్తు­న్నా­రు. సప్లి­మెం­ట­రీ పరీ­క్ష­లు, ఇతర మా­ర్గాల ద్వా­రా తి­రి­గి వి­జ­యా­న్ని సా­ధిం­చే అవ­కా­శం ఎల్ల­ప్పు­డూ ఉం­టుం­ద­ని వారు చె­బు­తు­న్నా­రు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రుల పాత్ర కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పిల్లలపై అధిక ఒత్తిడి తీసుకురాకుండా, వారికి మానసిక ధైర్యం నూరిపోసే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. విఫలం అనేది అంతిమం కాదని హితవు పలుకుతున్నారు.

Tags

Next Story