Secunderabad: సూపర్ తాత.. 99 ఏళ్ల వయసులో కూడా..

Secunderabad: వీధి చివర ఉన్న పచారీ కొట్టుకు వెళ్లి సరుకులు పట్రమంటే.. ఎందుకమ్మా ఆన్ లైన్ లో ఆర్డర్ పెడితే వాళ్లే తీసుకువచ్చి ఇస్తారు. అంత దూరం ఎవరు వెళ్తారు.. బండి కూడా లేదు అనే బద్దకస్తులు ఉన్న ఈ ప్రపంచంలో.. ఈ తాత లాంటి వాళ్లు ఎక్కడో కానీ ఉండరు.. 99 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా నేటి తరంతో పోటీ పడుతున్నట్లు ఉన్నారు.. అందుకే ఆదివారం సికింద్రాబాద్ ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్ లో నిర్వహించిన సీనియర్ సిటిజన్ నడక పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు నల్గొండ జిల్లాకు చెందిన యాదగిరి.
19 ఏళ్ల యువతీ యుకులతో పోటీపడి నడిచారు.. ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. చిన్నవయసు నుంచే వ్యవసాయం చేస్తుండేవారు. వరి, కంది, ఇతర పంటలను సాగుచేసేవారు. పదేళ్ల క్రితం భార్య మరణించింది. అయినా ఆహార, వ్యవహార శైలిలో మార్పులేదు.. తెల్లవారు జామునే లేచి పొలం బాట పట్టడం, అన్నీ దగ్గరుండి చూసుకోవడం ఆయన దిన చర్యలో భాగం.
యాదగిరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు మొత్తం కలిసి యాదగిరి కుటుంబంలో 46 మంది సభ్యులు ఉన్నారు. ఏ అలవాట్లు లేకపోవడంతో ఈ వయసులోనూ ఆరోగ్యంగా ఉన్నారు. తనపని తానే చేసుకుంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.. ప్రస్తుతం ఉప్పల్ లో న్న కుమారుడి వద్ద ఉంటున్నారు. రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం చేస్తానని చెప్పారు. ఏదైనా మితంగా తీసుకుంటాను.. ఎక్కువ తింటే అరక్కపోగా, ఆయాసం వస్తుంది అని చెప్తారు బోసి నవ్వుల తాత. 3వేల మీటర్ల నడకపోటీలో విజేతగా నిలిచిన తాతకు ఎల్లో జెర్సీని బహుమతిగా అందజేసారు నిర్వాహకులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com