CM Revanth Reddy : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట.. ఆ పిటిషన్ కొట్టివేత..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ను విచారించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. సోమవారం జరిగిన విచారణలో ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.
2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్టను దెబ్బతీశాయని ఆరోపిస్తూ, బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని రేవంత్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారణకు స్వీకరించడం కుదరదని స్పష్టం చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఊపిరి పీల్చుకున్నారు. కాగా సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com