SC: పార్టీ ఫిరాయింపులపై నేడే సుప్రీంలో విచారణ

SC: పార్టీ ఫిరాయింపులపై నేడే సుప్రీంలో విచారణ
X
ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అధికార-ప్రతిపక్షాలు

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. బీఆర్ఎస్ పార్టీ బీ ఫారం మీద గెలిచి.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం నేడు తేలనుంది. గత విచారణ సందర్భంగా అనర్హత నిర్ణయం తీసుకోడానికి ఇంకా ఎంత సమయం కావాలని ప్రభుత్వాన్ని సుప్రీం ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

ఫిరాయింపుల కేసు.. అంతా టెన్షన్

రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు నేడు(మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో నేడు జరిగే విచారణలో సుప్రీంకో ఏం ఆదేశాలు ఇస్తుందో అన్న ఉత్కంఠ తెలంగాణలో నెలకొంది.

ఇప్పటికే నోటీసులు ఇచ్చిన స్పీకర్

అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు అందజేశారు. దీంతో ఏం చేయాలనే ఆలోచనలో వారున్నారు. అదే క్రమంలో వారి సభ్యత్వాలు రద్దవుతాయని, రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని బీఆర్‌ఎస్‌ నమ్మకంగా చెబుతోంది. ఈ నేపథ్యంలో రేపటి విచారణ కీలకంగా మారగా.. పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం రేపటి తీర్పుతో తేలుతుందా లేక కేసు మరోసారి వాయిదా పడుతుందా? చూడాలి.

Tags

Next Story