SC: కోర్ట్ ధిక్కరణ కేసులో..స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

SC: కోర్ట్ ధిక్కరణ కేసులో..స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
X
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కలకలం

ఎమ్మె­ల్యేల ఫి­రా­యిం­పుల కే­సు­లో కీలక పరి­ణా­మం చో­టు­చే­సు­కుం­ది. కో­ర్ట్ ధి­క్క­రణ కే­సు­లో తె­లం­గాణ స్పీ­క­ర్ గడ్డం ప్ర­సా­ద్ కు సు­ప్రీం కో­ర్ట్ నో­టీ­సు­లు జారీ చే­సిం­ది. బీ­ఆ­ర్ఎ­స్ ఫి­రా­యిం­పు ఎమ్మె­ల్యే అన­ర్హత కే­సు­లో స్పీ­క­ర్ కో­ర్ట్ ఆదే­శా­ల­ను ధి­క్క­రిం­చా­ర­ని బీ­జే­పీ ఎమ్మె­ల్యే మహే­శ్వ­ర్ రె­డ్డి సు­ప్రీం కో­ర్ట్ ను ఆశ్ర­యిం­చా­రు. ప్ర­ధాన పి­టి­ష­న్ తో ట్యా­గ్ చే­సిన సు­ప్రీం కో­ర్టు.. ఈ కే­సు­లో కే­టీ­ఆ­ర్ వే­సిన పి­టి­ష­న్ తో మహే­శ్వ­ర్ రె­డ్డి పి­టి­ష­న్ ధర్మా­స­నం ట్యా­గ్ చే­సిం­ది. తదు­ప­రి వి­చా­రణ ఫి­బ్ర­వ­రి 6 కు వా­యి­దా వే­సిం­ది.

ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేస్తూ అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. అయితే ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో విషయం సుప్రీంకోర్టు వరకు చేరింది. గత విచారణ సందర్భంగా స్పీకర్ నాలుగు వారాల్లోగా కోర్టు ధిక్కార పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్‌కు నోటీసులు జారీ చేయాలని పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరేనా? లేక కోర్టా? అన్న కీలక ప్రశ్నలను కూడా ధర్మాసనం లేవనెత్తింది. తెలంగాణ ఎమ్మెల్యేల పిరాయింపు వ్యవహారంలో మూడు నెలల పాటు నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.

తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో సం­చ­ల­నం సృ­ష్టిం­చిన పా­ర్టీ ఫి­రా­యిం­పుల వ్య­వ­హా­రం­లో శా­స­న­సభ స్పీ­క­ర్ గడ్డం ప్ర­సా­ద్ కు­మా­ర్ కీలక ని­ర్ణ­యా­లు తీ­సు­కు­న్నా­రు. మొ­త్తం ఏడు­గు­రు ఎమ్మె­ల్యే­ల­పై దా­ఖ­లైన అన­ర్హత పి­టి­ష­న్ల­ను కొ­ట్టే­శా­రు. బా­న్సు­వాడ ఎమ్మె­ల్యే, మాజీ స్పీ­క­ర్ పో­చా­రం శ్రీ­ని­వా­స్ రె­డ్డి , చే­వె­ళ్ల ఎమ్మె­ల్యే కాలె యా­ద­య్య పై దా­ఖ­లైన అన­ర్హత పి­టి­ష­న్ల­ను స్పీ­క­ర్ కొ­ట్టి­వే­శా­రు. గత నె­ల­లో స్పీ­క­ర్ మరో ఐదు­గు­రు ఎమ్మె­ల్యేల వి­ష­యం­లో కీలక ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­రు. అరి­కె­పూ­డి గాం­ధీ, తె­ల్లం వెం­క­ట­రా­వు, బం­డ్ల కృ­ష్ణ­మో­హ­న్ రె­డ్డి, ప్ర­కా­ష్ గౌడ్, గూ­డెం మహి­పా­ల్ రె­డ్డి లపై ఉన్న అన­ర్హత పి­టి­ష­న్ల­ను కూడా స్పీ­క­ర్ కొ­ట్టి­వే­శా­రు.

Tags

Next Story