SC: నేడు కేసీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
విద్యుత్ కమిషన్‌పై మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేయనున్నారు. ఈ పిటిషన్‌పై సీజేఐ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. విద్యుత్ కమిషన్ రద్దు కోరుతూ గతంలో కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ శాఖలో జరిగిన అవకతవకలపై విచారణకు కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది . హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో తాజా పిటిషన్ వేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం.. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం తదితర అంశాలపై విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేశారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయగా.. కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన కమిషన్ విచారణకు పిలిచింది .
విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ వివరణ కోరింది. తనను విచారణకు పిలవకూడదంటూ గులాబీ బాస్ తెలంగాణ హై కోర్టును ఆశ్రయించగా.. అక్కడ చుక్కెదురైంది. దీంతో.. కేసీఆర్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో గులాబీ బాస్ సవాల్ చేశారు. రేపు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ జరగనున్నది. కాగా ఈ కేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
గత బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ జస్టిస్ నరసింహా రెడ్డి నేతృత్వంలో కమిషన్ వేసింది రేవంత్ ప్రభుత్వం. విచారణలో భాగంగా కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే నరసింహా రెడ్డి తీరును కేసీఆర్ తప్పుపట్టారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. జస్టిస్ నరసింహా రెడ్డి విచారణ వివరాలను మీడియా ముందు వెల్లడించడాన్ని తప్పుపట్టారు కేసీఆర్. కమిషన్ నుంచి తప్పుకోవాలని జస్టిస్ నరసింహా రెడ్డికి లేఖ సైతం రాశారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో కేసీఆర్ వేసిన పిటీషన్‌పై వెలువడే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com