SC: హెచ్‌సీయూ వివాదంపై "సుప్రీం" ఆదేశాలు

SC: హెచ్‌సీయూ వివాదంపై సుప్రీం ఆదేశాలు
X
సుమోటోగా విచారణ చేపట్టిన ధర్మాసనం.. తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం చర్యలన్నింటినీ నిలిపేయాలని ఆదేశం

కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చర్యలు అన్నింటినీ నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్ లోని కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరిపింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టివేయడం చాలా తీవ్రమైన అంశమని జస్టిస్ గవాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరరని.. తెలంగాణ ప్రధాన కార్యదర్శిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్ల నరికివేతగా సుమోటోగా విచారణ చేపట్టామని.. హైకోర్టు రిజిస్ట్రార్ ను ప్రత్యక్ష పరిశీలనకు పంపించి నివేదిక తెప్పించుకున్నామని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్నామని జస్టిస్ గవాయ్ ప్రకటించారు. ఈ వ్యవహారానికి సంబంధించి వార్తా కథనాలను అమికస్‌ క్యూరీ.. జస్టిస్‌ గవాయ్‌ ధర్మాసనం ముందు మెన్షన్ చేసింది.

ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు

అటవీ భూముల్లో కూల్చివేతలకు అటవీ పర్మిషన్ తీసుకున్నారా అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కంచ గచ్చిబౌలి భూముల్లో భారీ నిర్మాణాలు చేపట్టినట్లుగా గుర్తించామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నెమళ్లు ఇతర వన్య ప్రాణాలు ఉండే వంద ఎకరాల ప్రాంతాన్ని ధ్వంసం చేసినట్లుగా నివేదిక వచ్చిందని సుప్రీంకోర్టు తెలిపింది. పర్యావరణ, ఫారెస్ట్ అనుమతులు తీసుకున్నారో లేదో అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగణ సీఎస్‌ను సర్వోన్నత న్యాయస్థాం ఆదేశించిందది. అటవీ ప్రాంతంలో ఎందుకు చెట్లు నరికేశారని ప్రశ్నించింది. రిట్ పిటిషన్ తయారు చేయాలని అమికస్ క్యూరికీ సుప్రీంకోర్టు సూచించింది. తెలంగాణ సీఎస్ ను ప్రతివాదిగా చేర్చాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఏదైనా ఉల్లంఘన జరిగితే సీఎస్‌దే బాధ్యతని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

వాళ్లు సమాధానం చెప్పాల్సిందే..

తెలంగాణ ప్రభుత్వం గత నెల 15న నియమించిన కమిటీలోని అధికారులు సైతం సమాధానం చెప్పాలని హుకుం జారీ చేసింది. ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా.. చెట్లు కొట్టేసే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన నివేదికలోని ఫొటోలు చూసి అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పింది. వందల కొద్దీ యంత్రాలు మోహరించాల్సిన అగత్యం ఏంటో అర్థం కావడం లేదని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు.

Tags

Next Story