Suryapet: డీసీఎంఎస్ చైర్మన్ జానయ్యయాదవ్ పై వెల్లువెత్తుతోన్న ఆరోపణలు

సూర్యాపేట జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్యయాదవ్ పలు అక్రమాలకు పాల్పడ్డట్ట ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన బాధితులు పోలీస్‌స్టేషన్లకు క్యూ కడుతున్నారు. గాంధీనగర్‌కు చెందిన బుచ్చిరాములు తన ఆరెకరాల భూమిని జానయ్యయాదవ్ కబ్జా చేశాడని వాపోయాడు. రెండు దశాబ్దాల క్రితం జానయ్యను చేరదీసి ఉప సర్పంచ్‌ను చేస్తే తన భూమినే కాజేశాడని ఆరోపించాడు. తన భూమి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఫంక్షన్‌హాల్ కూడా నిర్మించారని చెప్పారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తన ఇంటి నుంచి తననే తరిమేశాడని వాపోయాడు. ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ను కలిసి బుచ్చిరాములు అన్ని ఆధారాలు సమర్పించాడు. దీంతో పోలీస్ ప్రొటెక్షన్‌తో ఆయన నాలుగేళ్ల తర్వాత సొంత ఇంటికి చేరుకున్నాడు. తనలాంటి బాధితులు 150 మంది వరకు ఉన్నారని బుచ్చిరాములు చెబుతున్నారు.
రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్లకు డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్ బాధితులు క్యూకడుతున్నారు. తమను జానయ్య కిడ్నాప్ చేసి 30 లక్షలు వసూలు చేశాడని కూకట్‌పల్లికి చెందిన దంపతులు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకుంటే రైస్‌మిల్లులో నిర్బంధించి చిత్రహింసలు పెట్టాడని ఆరోపించారు. ఆధారాలతో సహా కూకట్‌పల్లి పీఎస్‌లో బాధితురాలు పెనుగంటి మమత ఫిర్యాదు చేశారు. జానయ్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com