మార్తమ్మా.. నీ సేవలకు సలాం... సూర్యాపేట మహిళకి ఢిల్లీలో సన్మానం!

మార్తమ్మా.. నీ సేవలకు సలాం... సూర్యాపేట మహిళకి ఢిల్లీలో సన్మానం!
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ విలయ తాండవం చేసిన ఆ సమయంలో మెరుగు మార్తమ్మ అనే పారిశుధ్య కార్మికులు నిర్విరామంగా పనిచేశారు.

కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో అన్ని రంగాలు కూడా తలుపులు వేసుకొని ఇంట్లో బిక్కుబిక్కుమంటూ జీవనం గడిపితే వైద్యులు, పారిశుధ్య కార్మికులు మాత్రం తమ విధులను నిర్విరామంగా కొనసాగించారు. అయితే వారి సేవలను గుర్తించినందునే, మొట్టమొదటగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వారితోనే ప్రారంభించారు.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఓ తెలుగు పారిశుధ్య కార్మికురాలు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ విలయ తాండవం చేసిన ఆ సమయంలో మెరుగు మార్తమ్మ అనే పారిశుధ్య కార్మికులు నిర్విరామంగా పనిచేశారు. ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా తన విధులను నిర్వర్తించింది.

కరోనా కష్టకాలంలో ఆమె చేసిన అపూర్వ సేవలను జాతీయ మహిళా కమిషన్ గుర్తించింది. ఈ క్రమంలో మార్తమ్మను జనవరి 31న ఢిల్లీలో మహిళా శిశు సంక్షేమ మంత్రి చేతుల సన్మానించి, ప్రశంసా పత్రం అందజేయనున్నారు. కాగా, మెరుగు మార్తమ్మ భర్త అనారోగ్యంతో మృతి చెందగా తన ఇద్దరు కుమారులతో కలిసి కుటుంబాన్ని నడుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story