KCR Delhi Tour: సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్..
KCR Delhi Tour: సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ వేదికగా ప్రెస్‌మీట్ పెడతారని, ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో హైలెట్ చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.
అయితే, ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ఫిక్స్ కాలేదని తెలుస్తోంది. ఒకవేళ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లేటట్లయితే.. ముఖ్యమంత్రి కంటే ముందుగానే ఓ టీమ్ ఢిల్లీకి వెళ్తుంది. ప్రస్తుతం ఢిల్లీ టీమ్ సైతం హైదరాబాద్‌లోనే ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటనపై కేసీఆర్ మౌనం వెనక ఆంతర్యం ఏంటో పార్టీ శ్రేణులకు సైతం అంతుబట్టడం లేదు. నిన్న నలుగురు ఎమ్మెల్యేలను ప్రగతి భవన్‌కు పిలిపించారు. అదే సమయంలో మంత్రులు కేటీఆర్, హరీష్‌రావును సైతం ప్రగతిభవన్‌కు వెళ్లి.. ఫామ్‌హౌస్ ఘటనపై సీఎం కేసీఆర్‌తో చర్చించారు.
దీనిపై నిన్ననే సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడతారనే ప్రచారం జరిగింది. కాని, ఏ వ్యూహంతో ఉన్నారో గానీ.. ఎమ్మెల్యేల కొనుగోళ్లపై టీఆర్‌ఎస్ శ్రేణులు మొత్తం సైలెంట్‌గా ఉన్నాయి. అటు మంత్రి కేటీఆర్ సైతం మీడియా ముందు ఈ విషయంపై ఎవరూ మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఫామ్‌హౌస్ ఘటనపై టీఆర్‌ఎస్ నుంచి ఎలాంటి ప్రకటనలు, కామెంట్లు రావడం లేదు.
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ అధికారికంగా ఫిక్స్ కాలేదని చెబుతున్నారు. ఇవాళ ప్రగతి భవన్‌లోనే ఉండనున్నారు సీఎం కేసీఆర్. జాతీయపార్టీ ఏర్పాట్లలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇవాళ మరికొంతమంది ప్రాంతీయ పార్టీల నేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com