Munugode: మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ మాజీ అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు

Munugode: మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ మాజీ అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు
Munugode: మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ మాజీ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఎంబీ జగన్నాథరావుపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది.

Munugode: మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ మాజీ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఎంబీ జగన్నాథరావుపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్రా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక రిటర్నింగ్ అధికారికి సరైన భద్రత కల్పించడంలో విఫలమైన డీఎస్పీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది.


ఉప ఎన్నికల్లో యుగతులసి పార్టీ అభ్యర్థికి కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును మార్చి బేబీ వాకర్ గుర్తును కేటాయించడాన్ని తప్పుబట్టిన కేంద్ర ఎన్నికల సంఘం.. జగన్నాథరావుపై చర్యలకు ఆదేశించింది. ఇక ఇప్పటికే జగన్నాథరావు స్థానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ ను ఆర్వోగా నియమించింది.

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఇంటింటి ప్రచారంలో పాల్గొంటూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతలు మొయినాబాద్‌ ఫామ్ హౌస్ వ్యవహారాన్ని బూచీగా చూపి ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.


బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తూదని గులాబీ నేతలు ఆరోపిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జరిగిందని టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తూ.. ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ రెండు పార్టీల ప్రచారంతో మునుగోడులో పొలిటికల్ హీట్ పెరుగుతుంది.

టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు సహా.. ఇతర నేతలంతా మునుగోడు నియోజకవర్గంలోనే తిష్టవేశారు. కేంద్రం, రాష్ట్ర బీజేపీ నేతలే టార్గెట్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు బీజేపీ తరపున రాష్ట్ర, జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు నియోజకవర్గంలో మకాం వేశారు.


ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ సర్కారుపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మునుగోడుకు టీఆర్ఎస్ చేసిందేమీ లేదని రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే అభివృద్ధి జరిగిందంటున్నారు. కేసీఆర్ నిధులు ఇవ్వకపోవడంతోనే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కేసీఆర్ దిగొచ్చారని బీజేపీ నేతలు అన్నారు.


ఇక మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డికి మరోసారి పట్టం కట్టాలని పిలుపు నిచ్చారు. మరోవైపు సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు కాంగ్రెస్ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో పాల్గొంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.


రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి కట్టుగా పని చేసి మునుగోడును గెలిపించుకోవాలని రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరిగింది. పాల్వాయి స్రవంతి విజయం కోసం కాంగ్రెస్ శ్రణులు శక్తికి మించి పని చేస్తున్నారు.


బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పిస్తతూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. అటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తమ స్టైల్ ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. మొత్తంగా ఉప ఎన్నికతో మునుగోడులో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. నవంబర్ 3 మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. 6న ఫలితం వెలువడ నుంది. ఇక నవంబర్ 1న సాయంత్రం నుంచి మైకులు బంద్ కానున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story