Telangana Assembly : బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

BJP : తెలంగాణ శాసనసభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. గవర్నర్ ప్రసంగం లేకపోవడంతో బడ్జెట్ ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో బడ్జెట్ ప్రసంగం మధ్యలోనే స్పీకర్ పోచారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ అనుమతితో మంత్రి తలసాని తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో అసెంబ్లీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలపై ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ వేటు పడింది. తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలను బలవంతంగా అసెంబ్లీ నుంచి బయటకు తరలించారు. బీజేపీ ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఈటల రాజేందర్ తొలి రోజే సస్పెన్షన్‌కు గురయ్యారు. దీంతో ఈ సెషన్ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కోల్పోయారు. మరోవైపు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామనుకున్న బీజేపీ వ్యూహానికి చెక్ పెట్టినట్లయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com