T Congress : "BRS అంటే బందిపోట్ల రాక్షస సమితి"

సర్కార్‌పై స్పీడ్ పెంచిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పాలనపై మూడో ఛార్జిషీట్ విడుదల చేసింది. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాక్షస సమితి అన్న టీపీసీసీ కేసీఆర్ పాలనలో వ్యవసాయం విధ్వంసం అయిందంటూ ఛార్జిషీట్‌ను విడుదల చేసింది. ఎనిమిదిన్నరేళ్ల కేసీఆర్ పరిపాలనలో వ్యవసాయాన్ని దండగ చేశారన్నారు. కోటి ఎకరాల మగాణి అంటూ భూటకపు మాటలు చెప్పారని అనాలోచిత నిర్ణయాలతో వ్యవసాయ రంగం కుదేలైందని, రైతు బంధు భూస్వాములకు వరంగా మారిందన్నారు.
ఇక కౌలు రైతులను కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని, రుణమాఫీ లేక రైతులు గోస పడుతున్నారని ఛార్జ్ షీట్‌లో తెలిపారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని, రైతు ఆత్మహత్యలను అవహేళన చేస్తూ మాట్లాడుతున్న వ్యవసాయ మంత్రిని వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహాత్యలు చేసుకుంటున్న రైతుల్లో ఎక్కువగా కౌలు రైతులు ఉన్నారని సీడ్ బౌల్‌పై కేసీఆర్ చెప్పిన మాటలు నీటి మూటలు అయ్యాయని టీపిసీసీ ఛార్జ్‌షీట్‌లో తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com