T Congress: యశ్వంత్ సిన్హా టూర్‌తో కాంగ్రెస్‌లో విభేదాలు.. ఆయనను కలిసేది లేదంటున్న నేతలు..

T Congress: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. హైదరాబాద్ పర్యటనతో కాంగ్రెస్‌లో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న యశ్వంత్‌ను కలవద్దన్న టీపీసీసీ నిర్ణయంతో భిన్నస్వరాలు వినిపించాయి. తాము యశ్వంత్‌ను కలువబోమని పీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి ప్రకటించినా ఆయన ఆదేశాలను ఆపార్టీ నేతలు లెక్కచేయలేదు. సీనియర్ నేత వీహెచ్ ఎయిర్‌పోర్ట్ వెళ్లి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకడంతో ఆ పార్టీ శ్రేణుల ఆశ్చర్యపోయారు.
అటు యశ్వంత్‌ను కలిసేందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం అపాయింట్‌మెంట్ కోరారు. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నప్పుడు సిన్హాను సీఎల్‌పీకి పిలిచిఉంటే బాగుండేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అటు సిన్హాను భేటీ కావొద్దన్న రేవంత్, భట్టిలను తప్పుపడుతూ జగ్గారెడ్డి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. యశ్వంత్ సిన్హాను కాంగ్రెస్ నేతలు కలవడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.
పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళితే.. గోడకేసి కొడతామంటూ మాట్లాడటం పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. పార్టీ పరంగా క్రమశిక్షణాచర్యలు ఉంటాయన్నారు రేవంత్ రెడ్డి. ఆ గోడపై వాలిన కాకి.. ఈ గోడపై వాలడానికి వీళ్లేదంటూ వ్యాఖ్యలు చేశారు. పిల్లలాట ఆడొద్దు.. ఇది పార్టీ వ్యవహారమన్నారు రేవంత్.ఇక రేవంత్ వ్యాఖ్యలపై ఘాటుగానే రిప్లై ఇచ్చారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రేవంత్ రెడ్డి ఎవర్ని బండకేసి కొడతారో చెప్పాలని ప్రశ్నించారు.
అంత కోపం ఉన్న వ్యక్తి పీసీసీకి ఏం పని కొస్తాడని మండిపడ్డారు. పీసీసీ లేకుంటే రేవంత్‌కు విలువే ఉండదన్నారు. పీసీసీ నుంచి రేవంత్‌ను తొలగించమని హైకమాండ్‌కు లేఖ రాస్తామని.. రేవంత్ లేకపోయినా పార్టీని నడిపిస్తామన్నారు జగ్గారెడ్డి. మొత్తానికి యశ్వంత్ సిన్హా రాకతో.. టీ.కాంగ్రెస్‌లో చిచ్చు ఇంకా చల్లారలేదనేది అర్థమవుతోంది. ఇటీవలె రాహుల్ గాంధీ కూడా జోక్యం చేసుకుని నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా.. సీనియర్లు, జూనియర్ల వార్ నడుస్తూనే ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com