నేడే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ప్రారంభానికి సిద్ధమైంది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబెడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించనున్నారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనమడు ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభానికి రెడీ అయింది. తెలంగాణ సమాజంతో పాటు యావత్ దేశ ప్రజలు సంబరపడేలా గొప్పగా ఆవిష్కరించనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పూల జల్లు కురిపిస్తూ భారత రాజ్యాంగ నిర్మాతకు ఘనమైన రీతిలో పుష్పాంజలి ఘటించించనున్నారు. ఈ కార్యక్రమానికి బౌద్ధ భిక్షువులను మాత్రమే ఆహ్వానించి వారి సాంప్రదాయ పద్దతిలోనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహవిష్కరణతో జాతీయస్థాయిలో హైదరాబాద్ ఇమేజ్ పెరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com