Tamilisai Soundararajan: 'ప్రభుత్వం తన ప్రవర్తనను మార్చుకోవాలి'.. ప్రజా దర్బార్ తమిళిసై..

Tamilisai Soundararajan: ప్రభుత్వం తన ప్రవర్తనను మార్చుకోవాలి.. ప్రజా దర్బార్ తమిళిసై..
Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నారు.

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా మహిళా సమస్యలపై ఫోకస్ చేస్తూ వారి నుంచి వినతులు స్వీకరించారు. దాదాపు 400 మంది అపాయింట్‌మెంట్‌ కోరిన నేపథ్యంలో వారితో మాట్లాడి వారి వినతులు తీసుకున్నారు. తెలంగాణలో మహిళలకు అండగా, తోడుగా తాను ఎప్పుడూ ఉంటానని అభయమిచ్చారు.

మహిళలకు, ప్రభుత్వానికి వారధిగా తాను ఉండాలని అనుకుంటున్నానని, దీనికి ఎదురు చెప్పే వాళ్లను పట్టించుకోనని అన్నారు. ప్రజల పక్షాన తాను ఎప్పుడూ బలమైన శక్తిగా ఉంటానన్నారు. తనను ఎవరూ అడ్డుకోలేరని తమిళిసై అన్నారు. ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసమేనని, గవర్నర్‌ను కలవడానికి ఎలాంటి ఆంక్షలు ఉండవని ఈ సందర్బంగా తమిళిసై అన్నారు.

కరోనా సమయంలో తనను బయటకు వెళ్లొద్దని సెక్యూరిటీ వారించినా రోగుల్ని పరామర్శించి ధైర్యం చెప్పానని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మహిళా నేతలు కూడా గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలో పరిస్థితుల్ని వివరించేందుకు సిద్ధమయ్యారు. గవర్నర్‌ హుందాగా, తటస్థంగా ఉండాల్సింది పోయి ఇలా రాజకీయ కోణంలో ప్రజాదర్బార్‌లు నిర్వహించడం సరికాదని అధికార పార్టీ విమర్శిస్తున్నా తమిళిసై తనదైన శైలిలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రజా దర్భార్‌లో తెలంగాణ గరవ్నర్‌ తమిళసై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా మాత్రమే రాజ్‌భవన్‌ ఉంటుందన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఉందన్నారు. మహిళ దర్బార్‌పై వచ్చిన విమర్శలు కరెక్ట్‌ కాదన్న ఆమె.. మైనర్‌ రేప్‌ పై అడిగిన రిపోర్ట్‌ ప్రభుత్వం నుంచి అందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

రాజ్యాంగబద్దమైన పోస్టులను, గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. కానీ.. ప్రభుత్వం ప్రోటోకాల్‌ ఫాలో కావడం లేదన్నారు. అయినా తన కార్యక్రమాలను ఎక్కడా ఆపడం లేదన్నారు గవర్నర్‌. తెలంగాణలో సమస్యలు ఉన్నాయని .అందుకే ఇంత స్పందన వచ్చిందన్నారు. ప్రభుత్వం తన ప్రవర్తనను మార్చుకోవాలని.. సమస్యల పరిష్కరానికి ప్రయత్నించాలన్నారు. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై మానిటరింగ్‌ ఉంటుందన్నారు గవర్నర్‌ తమిళసై.

Tags

Read MoreRead Less
Next Story