Tamilisai Soundararajan: హాట్ టాపిక్‌గా మారిన తమిళిసై మహిళా దర్భార్..

Tamilisai Soundararajan: కేసీఆర్ సర్కార్ తో గవర్నర్ తమిళి సై.. సై అంటే సై అంటున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది.. రెండో సారి ప్రజాదర్భార్ నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. కేవలం రాజ్‌భవన్ కే పరిమితమై రాష్ట్రాల పాలనలో జోక్యం చేసుకోని గవర్నర్‌లు చాలామందే ఉన్నారు.. అయితే తాను రాజ్‌భవన్ కు పరిమితం కానని ప్రజాక్షేత్రంలో వెళుతానని గతంలోనే తేల్చి చెప్పారు గవర్నర్ తమిళిసై.. ప్రజాదర్భార్ పేరుతో నేరుగా ప్రజలను కలుస్తున్నారు..పనిలో పనిగా వివిధ శాఖల పనితీరును కూడా సమీక్షలు కూడా జరుపుతున్నారట..
గవర్నర్ కు రాష్ట్ర పాలనలో ఉండే అధికారులు ఏంటో ముందు ముందు కేసీఆర్ కు చూపించే పనిలో గవర్నర్ ఉన్నారన్న టాక్ కూడా నడుస్తోంది..ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాలను కూడా పరిశీలించి వచ్చారు కూడా.. దీంతో గవర్నర్ నేరుగా ప్రజలతో మమేకం అవుతున్నారని చెప్పక తప్పదు.. తాజాగా మహిళా సమస్యల పరిష్కారం కోసం రాజ్ భవన్ లో ఓ సెల్ కూడా ఏర్పాటు చేశారు.. అంతేకాదు ఏకంగా జాతీయ మహిళా కమీషన్ చైర్‌పర్సన్ ను కూడా తీసుకువచ్చారు..మహిళలకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తామని హామీ కూడా ఇచ్చేశారు..
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళకు నేరుగా ఇరవైఐదు వేల రూపాయల ఆర్ధిక సాయం చేశారు తమిళిసై. ఈ దర్భార్ ఎవరిని ఉద్దేశించి ఏర్పాటుచేసింది కాదని కేవలం మహిళా సమస్యల పరిష్కారం కోసమేనని అన్నారు గవర్నర్ తమిళిసై. మరోవైపు తెలంగాణాలో ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ. మహిళలకు ఏమైనా సమస్యలు ఉంటే జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తామని అన్నారు రేఖాశర్మ.
మహిళా సమస్యల పరిష్కారానికి పోర్టల్ లో కంప్లైట్ చేయవచ్చని, ప్రజల సమస్యల పరిష్కారానికి గవర్నర్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్.. ఓ పక్క ఎవరిని ఉద్దేశించి కాదూ అంటూనే గవర్నర్ యాక్టివ్ మోడ్ లో దూసుకువెళుతున్నారు.. ముందుస్తు ఎన్నికలకు తాను సిద్దం అంటూ కేసీఆర్ అంటుంటే విపక్షాలు కూడా మేం కూడా రెడీగా ఉన్నాం అంటూ కౌంటర్లు ఇస్తున్న నేపధ్యంలో గవర్నర్ తమిళిసై నేరుగా ప్రజా క్షేత్రంలోకి వెళ్లడం చూస్తూంటే కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com