Tarun Chugh: తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: తరుణ్‌చుగ్

Tarun Chugh: తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్‌చుగ్. రాష్ట్రంలోదారుణ పరిస్థితులు నెలకొన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్లే నేరాలు పెరుగుతున్నాయన్నారు. ఎంఐఎంకు భయపడి సీఎం కేసీఆర్ ఏమీ మాట్లాడట్లేదని.. దారుణాలపై ప్రశ్నించినవారిపైనే కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ కారులో దారుణం జరిగితే అది ఎవరిదో చెప్పట్లేదంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ పోలీసులు అధికార పార్టీ నేతలకే రక్షకులుగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు తరుణ్‌చుగ్.
ఈ కేసులో.. ప్రభుత్వం నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రిమాండ్‌కు తరలించే వరకు ఇదే ప్రయత్నం కొనసాగిందన్నారు. ఎంఐఎం కోసం సీఎం కేసీఆర్ అత్యాచారం కేసును..నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చట్టం ప్రకారం వ్యవహరించాల్సిన పోలీసులు వైఫల్యం చెందారని.. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com