Tatkal Booking for LPG: తత్కాల్‌లో గ్యాస్ బుకింగ్.. గంటలో ఇంటికి..

Tatkal Booking for LPG: వంట చేస్తున్నప్పుడు సడెన్‌గా గ్యాస్ అయిపోతే.. ఇంట్లో స్పేర్ సిలిండర్ ఉండి కూడా బుక్ చేసి ఉండకపోతే.. ఎంత కష్టం.. ఇక ఆ కష్టాలన్నింటికీ చెక్ పెట్టేయొచ్చు. బుక్ చేసిన గంటలోనే మీ ఇంటికి సిలిండర్ వచ్చేస్తుంది తత్కాల్ బుకింగ్ ద్వారా. ఈ పథకాన్ని తొలిసారిగా హైదరాబాద్‌లో అమలు
చేస్తు్న్నారు.
ఇప్పటి వరకు సిలిండర్ అయిపోతే గ్యాస్ ఏజెన్సీకి వెళ్లడం లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేయడం లేదా ఫోన్‌లో ఐవీఆర్ఎస్ పద్ధతిలో సిలిండర్ బుక్ చేయాల్సి వచ్చేది. ఇక బుక్ చేసిన సిలిండర్ ఇంటికి రావాలంటే ఒక్కోసారి త్వరగానే వచ్చినా చాలా సార్లు వారం రోజులు పట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. ఈ సమస్యలన్నింటినీ తీర్చేందుకే తత్కాల్ స్కీమ్ ప్రవేశపెట్టాయి గ్యాస్ ఏజెన్సీలు.
దేశం మొత్తం మీద 28 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు ఉంటే అందులో 14 కోట్ల కనెక్షన్లు ఇండియన్ ఆయిల్ పరిధిలో ఉన్నాయి. దీంతో తత్కాల్ స్కీమ్‌ను ముందుగా ఇండియన్ ఆయిల్ పరిధిలో ఉన్న ఇంధన సిలిండర్లకు అమలు చేయనున్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ముందుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న సికింద్రాబాద్ డివిజన్‌లో ఈ పైలెట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు.
రెగ్యులర్‌గా గ్యాస్ బుక్ చేసే ఐవీఆర్‌ఎస్, ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్, ఇండియన్ ఆయిల్ వన్ యాప్‌లలో తత్కాల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. నిమిషాల వ్యవధిలోనే తత్కాల్‌లో ఆర్డర్ బుక్ అవుతుంది. డెలివరీకి రంగం సిద్ధమవుతుంది.
ఇక్కడ ఓ ట్విస్ట్ ఏంటంటే సిలిండర్ ప్రైజ్ కంటే ఓ రూ.25లు అదనంగా పే చేయాలి. మరి వెంటనే కావాలంటే తప్పదు కదా. అయితే ఈ సర్వీసులను ప్రస్తుతం సింగిల్ సిలిండర్ ఉన్న ఇళ్లకే అమలు చేస్తున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో తత్కాల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com