మొదటి సారి కేసీఆర్‌లో ఓటమి భయం కనిపించింది -రేవంత్‌ రెడ్డి

మొదటి సారి కేసీఆర్‌లో ఓటమి భయం కనిపించింది -రేవంత్‌ రెడ్డి
X
Revanth Reddy: కేసీఆర్‌కు 20 నెలల భయం పట్టుకుందన్న ఆయన.. మొదటి సారి ఆయనలో భయం కనిపిస్తుందన్నారు

మూడుచింతల పల్లి దీక్ష శిబిరం వద్ద.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. 20 ఏళ్ల అధికారం మనదే అన్నప్పుడే కేసీఆర్‌ తన ని అంగీకరించారని రేవంత్‌ విమర్శించారు. కేసీఆర్‌కు 20 నెలల భయం పట్టుకుందన్న ఆయన.. మొదటి సారి ఆయనలో భయం కనిపిస్తుందన్నారు. అందుకే అంచనాలు లేని హామీలు ఇస్తున్నారని విమర్శించారు. ఇక టీఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశం తరువాత పార్టీలో సీనియర్లు ఎవరు బ్రఫ్‌ చేయలేదన్నారు. ఆఖరకు కేసీఆర్‌ని చూసి కేటీఆర్‌ మీడియాకు సమాధానం చేపట్టారని విమర్శించారు. ఇక భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌ నాయకులు కేసీఆర్‌ను పక్కన కూర్చొడానికి కూడా భయపడతారని పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రజల్లో భమలు కల్పించారని.. వాటి నుంచి ఇప్పుడిప్పుడే అందరూ బయట పడుతున్నారని వివరించారు.

Tags

Next Story