Adilabad : టీచర్ పై కక్ష కట్టిన స్కూల్ విద్యార్థులు... ఏం చేశారంటే..

Adilabad : టీచర్ పై కక్ష కట్టిన స్కూల్ విద్యార్థులు... ఏం చేశారంటే..
X
Adilabad : తమపై ఉన్నతాధికారులకు తమపై ఫిర్యాదు చేశారని విద్యార్థులను టీచర్లు చితకబాదిన సంఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటు చేసకుంది

Adilabad : తమపై ఉన్నతాధికారులకు తమపై ఫిర్యాదు చేశారని విద్యార్థులను టీచర్లు చితకబాదిన సంఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటు చేసకుంది.. ఆదిలాబాద్‌ మండలం బంగారుగూడలోని మైనారిటీ బాలికల పాఠశాలలో ఈనెల 22న ఉన్నతాధికారుల బృందం తనిఖీలు చేశారు. అందులో భాగంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. కొందరు విద్యార్థులు భోజనం, టిఫిన్‌ బాగా లేదని అధికారులకు చెప్పారు.. ఇది దృష్టిలో పెట్టుకుని మరుసటి రోజు ముగ్గురు విద్యార్థులను చావగొట్టారు టీచర్లు.. ప్రిన్సిపాల్‌ పల్లవి, డ్రాయింగ్‌ టీచర్‌ అమ్రీన్‌, క్లాస్‌ టీచర్‌ మహాలక్ష్మి కంప్లయింట్‌ ఇచ్చినందుకు తమను కొట్టారంటూ విద్యార్థులు వాపోయారు. ఈ విషయం ఎవరికైనా చెబితే టీసీ ఇచ్చి పంపిస్తామని బెదిరించారని వాపోయారు.. అటు టీచర్ల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కిరాతకంగా ప్రవర్తించిన టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

Tags

Next Story