Telangana: PGT గురుకుల ఆన్‌లైన్‌ పరీక్షలో సాంకేతిక సమస్య

Telangana: PGT గురుకుల ఆన్‌లైన్‌ పరీక్షలో సాంకేతిక సమస్య

తెలంగాణ పీజీటీ గురుకుల ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహణలో సాంకేతిక సమస్య తలెత్తింది. సర్వర్‌లో సమస్య తలెత్తడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి ఇంగ్లీష్‌ పరీక్ష ఇంకా ప్రారంభం కాలేదు. ఉదయం 8:30 గంటలకే పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా, పరీక్షా కేంద్రాల్లోకి ఇంకా అభ్యర్థులను అనుమతించడం లేదు. సర్వర్‌లో సాంకేతిక సమస్య కారణంగా పరీక్ష ఆలస్యమైనట్లు పరీక్షా కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. కాగా, పీజీటీ ఇంగ్లీష్‌ పరీక్ష కోసం కేంద్రాలకు అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. ఖమ్మంలోని స్వర్ణభారతి ఇంజనీరింగ్ కాలేజీ ముందు అభ్యర్ధులు అధికారుల పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు.

పరీక్ష ప్రారంభం కాకపోవడంతో రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని పరీక్షా కేంద్రం ముందు అభ్యర్థుల ఆందోళనకు దిగారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది.

Tags

Next Story