REVANTH: ప్రతిపక్ష నేతలకు గేట్లు తెరిచామన్న రేవంత్‌

REVANTH: ప్రతిపక్ష నేతలకు గేట్లు తెరిచామన్న రేవంత్‌
ఇకపై పక్కా రాజకీయం చేస్తామని స్పష్టీకరణ... కేసీఆర్‌ పెంచిన గంజాయి మొక్కలను ఏరి పారేస్తామన్న సీఎం..

సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తామని... ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఇప్పటివరకూ ఆరు గ్యారంటీల్లో.. ఐదు పథకాలను అమల్ల్లోకి తెచ్చామన్న ఆయన.... దుబారాను తగ్గించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామన్నారు. నిజాం తరహాలో కేసీఆర్ తెలంగాణను పాలించేందుకు చూశారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ పెంచిన కొన్ని గంజాయి మొక్కలు ఇంకా ఉన్నాయని,వాటిని ఏరివేసే పనిలో ఉన్నామని రేవంత్‌రెడ్డి వివరించారు. కాంగ్రెస్‌ పార్టీలోకి ఇవాళే గేట్లు తెరిచామన్న ఆయన తమ ప్రభుత్వాన్ని కూల్చే యత్నాలను ధీటుగా తిప్పికొడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తైన సందర్భంగా, హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మీట్ ది మీడియా కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.


తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాల భర్తీతోపాటు, ప్రజాపాలన, ఆరు గ్యారంటీల అమలు అంశాలను వివరించారు. ఏడు తరాలుగా హైదరాబాద్‌ను పాలించిన నిజాం పాలకులు ఉస్మానియా యూనివర్సిటీ, ఆస్పత్రి నిర్మించి ఇదే అభివృద్ది అని చెప్పి ప్రజలను పీడించేవారని, అలాగే గత పదేళ్లు కేసీఆర్‌ కూడా నియంతలా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. ప్రైవేటు వారి చేతిలో ఉన్న ధరణిని ప్రభుత్వ సంస్థకు అప్పగించామని.. ధరణిని ఆధారం చేసుకొని తప్పులు చేసినట్లు నిర్దారణైతే ఉపేక్షించేది లేదన్నారు. తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా చేస్తామని, వైబ్రెంట్‌ తెలంగాణ ఫార్ములాతో ముందుకెళుతున్నట్లు వివరించారు. కాంగ్రెస్‌లోకి ఈ రోజు నుంచే గేట్లు తెరచిపెట్టామన్న రేవంత్‌రెడ్డి... మొదటి 100 రోజుల్లో ఫిరాయింపులకు పాల్పడలేదని చెప్పారు. ప్రభుత్వాన్ని కూలుస్తామని... బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు పదే పదే అంటున్నారని, ప్రభుత్వాన్ని పడగొడతామంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని పేర్కొన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ చిల్లర మాటలు మానుకోవాలన్న రేవంత్‌రెడ్డి కేంద్రంలో వాళ్ల ప్రభుత్వమే ఉన్నందున..... ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో కేసీఆర్ నాటిన కొన్ని గంజాయి మొక్కలు ఇంకా ఉన్నాయని....., వాటిని ఏరివేసే పనిలో ఉన్నామని కేంద్ర ప్రభుత్వం, గవర్నర్‌తో తాము సామరస్యంగా ముందుకు వెళుతున్నట్లు రేవంత్‌ రెడ్డి చెప్పారు. వ్యక్తిగత తగాదాలకు పోకుండా రాష్ట్ర హక్కులపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.


అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి అధికారాన్ని అడ్డంపెట్టుకొని దౌర్జన్యం చేస్తే... గత పాలకులకు ఏ గతి పట్టిందో అదే గతి పడుతుందని బీజేపీ నేత ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఈటల... ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం మెప్పు పొందడానికి...... బిల్డర్లను, వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం మాదిరిగానే..... ఈ ప్రభుత్వం కూడా రాజకీయ నాయకుల ఫోన్ లు టాపింగ్ చేస్తోందని ఈటల.....అనుమానం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story