TS: థేమ్స్‌ నది అభివృద్ధిపై రేవంత్‌ బృందం అధ్యయనం

TS: థేమ్స్‌ నది అభివృద్ధిపై రేవంత్‌ బృందం అధ్యయనం
X
మూసీ పునర్‌ వైభవానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చలు.... థేమ్స్‌ అభివృద్ధిని సీఎంకు వివరించిన పోర్ట్‌ ఆఫ్ లండన్‌ అధికారులు

మూసీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం లండన్‌లోని థేమ్స్ నదిపై అధ్యయనం చేసింది. లండన్‌పోర్ట్, థేమ్స్ నిర్వహణ అధికారులు, నిపుణులతో రేవంత్‌రెడ్డి చర్చించారు. మూసీపరీవాహక అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా లండన్ వచ్చినట్లు అధికారులకు తెలిపిన సీఎం థేమ్స్ నది చరిత్ర, అభివృద్ధికి ఎదురైన సవాళ్లు, ఇంజినీరింగ్, పెట్టుబడి, ఆదాయం తదితర అంశాలను పోర్ట్ ఆఫ్ లండన్ ఉన్నతాధికారులు రేవంత్‌రెడ్డికి వివరించారు. హైదరాబాద్‌లో మూసీ హుస్సేన్‌సాగర్, ఉస్మాన్ సాగర్ ప్రాధాన్యత, ప్రస్తుత పరిస్థితులపై థేమ్స్ నిపుణులకు సీఎం తెలిపారు. మూసీకి పునర్వైభవం వస్తే నది, చెరువులతో భాగ్యనగరం శక్తిమంతమవుతుందని వివరించారు. మూసీ విజన్ 2050కి స్పందించిన పోర్ట్ ఆఫ్ లండన్ బృందం పూర్తి సహకారమందిస్తామని భవిష్యత్‌లో మరిన్నిచర్చలు, భాగస్వామ్యానికి సిద్ధమని తెలిపింది.


మూసీఅభివృద్ధితో హైదరాబాద్ ప్రజలకు భవిష్యత్తులో పలు ప్రయోజనాలుంటాయని పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులు తెలిపారు. సుమారు వెయ్యిఅడుగులకుపైగా ఎత్తు ఉన్న 72 అంతస్తుల లండన్ షార్ట్‌పై నుంచి MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. లండన్ నగరం, థేమ్స్ నది పరీవాహకంలో అభివృద్ధిని వారు పరిశీలించారు. మూసీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అధ్యయనం చేసేందుకు గాను థేమ్స్ నది నిర్వహణ అధికారులు, నిపుణులతో చర్చించారు. మూసీ పరీవాహక అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా లండన్ వచ్చినట్లు అధికారులకు సీఎం తెలిపారు. థేమ్స్‌ నది చరిత్ర, అభివృద్ధికి ఎదురైన సవాళ్లు, ఇంజినీరింగ్‌, పెట్టుబడి, ఆదాయం తదితర అంశాలను పోర్ట్‌ ఆఫ్ లండన్‌ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు.


హైదరాబాద్‌లో మూసీ, హుస్సేన్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ వంటి చెరువుల ప్రాధాన్యత, ప్రస్తుత పరిస్థితులపై థేమ్స్‌ నిపుణులకు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మూసీకి పునర్‌వైభవం వస్తే నది, చెరువులతో హైదరాబాద్‌ మరింత శక్తిమంతమవుతుందని సీఎం వివరించారు. మూసీ విజన్‌ 2050కి స్పందించిన పోర్ట్‌ ఆఫ్‌ లండన్‌ బృందం పూర్తిగా సహకరిస్తామని, భవిష్యత్తులో మరిన్ని చర్చలు, భాగస్వామ్యానికి సిద్ధమని తెలిపింది.

దావోస్‌లో 37 వేల కోట్ల పెట్టుబడులు

పెట్టుబడుల వేటే లక్ష్యంగా మూడు రోజులపాటు సాగిన తెలంగాణ ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటన ముగిసింది. రైతులను ధనికులను చేయడమే లక్ష్యమన్న రేవంత్‌రెడ్డితో ఇప్పటివరకూ సుమారుగా 37వేల కోట్ల పైచిలుకు రూపాయలతో పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. అదానీ గ్రూప్‌ సంస్థలు అత్యధికంగా పెట్టుబడులు పెట్టడానికి మెుగ్గు చూపగా వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులకు అంగీకరించాయి.

Tags

Next Story