REVANTH: ప్రతీ పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు: సీఎం

తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి డేటా ప్రైవసీతో కూడిన డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు. ఒక వ్యక్తి హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు ఆ వ్యక్తి అంతకుముందు ఎలాంటి వైద్యం తీసుకున్నాడు. ఎలాంటి చికిత్సలు జరిగాయి. ఎలాంటి మందులు వాడారన్న సమగ్రమైన సమాచారాన్ని డిజిటిల్ హెల్త్ కార్డులో నమోదవుతుందని సీఎం రేవంత్ తెలిపారు. ఈ విషయాలన్నీ వైద్యులకు వెంటనే తెలిస్తే... వేగంగా వైద్యం అందించే వీలు ఉంటుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రముఖ వైద్యుడు నాగేశ్వరరావు సన్మానంలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే 35 శాతం బల్క్ డ్రగ్ తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతోందని రేవంత్ తెలిపారు. . ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారికైనా అవసరమైన వైద్య సహకారం అందించడానికి వీలుగా సమగ్ర హెల్త్ టూరిజం పాలసీని తీసుకురానున్నట్టు తెలిపారు.
హెల్త్ టూరిజం పాలసీ
తెలంగాణలో త్వరలో హెల్త్టూరిజం పాలసీని తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. విమానాశ్రయం సమీపంలో వేయి ఎకరాల్లో హెల్త్ క్యాంపస్‌ను ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రజలకే కాదు.. ఇతర దేశాలకు తెలంగాణలో సేవలందించేలా రాష్ట్రాన్ని హెల్త్ హబ్‌గా మార్చాలన్నదే తమ లక్ష్యమని రేవంత్ ప్రకటించారు. పేదలకు ఉచిత వైద్యం అందించాలని ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి దేశంలోనే మొట్టమొదటి సారిగా ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారుని రేవంత్ గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచిందని గుర్తు చేశారు.
భారత రత్నకు అర్హుడు
ప్రముఖ వైద్యుడు, పద్మ విభూషణ్అవార్డు గ్రహీత నాగేశ్వరరెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. బంజారాహిల్స్‌లో ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వరరెడ్డి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్... ఆయన సేవలను కొనియాడారు. నాగేశ్వరరెడ్డి తన సేవలతో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను దక్కించుకున్నారని అభినందించారు. ఆయన భారతరత్నకు కూడా అర్హుడని అన్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఇక్కడి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వారు దీన్ని బాధ్యత అనుకున్నందునే ఇంత గొప్ప గౌరవం దక్కిందన్నారు.
రాహుల్‌ని పీఎం చేసే వరకు విశ్రమించొద్దు
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు మనం విశ్రమించొద్దు అని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోవద్దన్నారు. రాహుల్ ప్రధాని అయితే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కులగణన అనే అతి పెద్ద కార్యక్రమం నిర్వహించామని సీఎం వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com