AP: మాకే ఎక్కువ సీట్లు... కాదు మాకే ఎక్కువ సీట్లు

AP: మాకే ఎక్కువ సీట్లు... కాదు మాకే ఎక్కువ సీట్లు
తెలంగాణలో ఎవరి ధీమా వారిదే... ఎక్కువ స్థానాలు తమవేనన్న నేతలు

ఈవీఎంలలో ఓటరు తీర్పు నిక్షిప్తమైంది. తెలంగాణ జననాడిపై ఎవరి లెక్కల్లో వారు మునిగిపోయారు. ప్రజాతీర్పు తమవైపే ఉందంటూ మూడు ప్రధానపార్టీల అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 10నుంచి 12స్థానాలు గెలుస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెబితే.. బీఆర్ఎస్‌ అభ్యర్థులే ఎక్కువ స్థానాల్లో గెలుస్తారని.... కేటీఆర్‌ స్పష్టం చేశారు. డబుల్‌ డిజిట్‌ దాటుతామని బీజేపీ పూర్తివిశ్వాసంతో ఉంది.

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. జననాడి E.V.Mలలో నిక్షిప్తం చేసింది. వచ్చే నెల 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ఈ లోపుగానే ఎవరి అంచనాల్లో వారు మునిగిపోయారు. ప్రధాన పార్టీలైనా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పోలింగ్‌ సరళిని అంచనావేస్తూ.. గెలుపుపై లెక్కలు వేసే పనిలోపడ్డాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. మెజార్టీ స్థానాల్లో విజయం తమదేనని విశ్వాసంతో ఉంది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో ప్రజలు తమకే అనుకూలమైన తీర్పునిచ్చారని.... కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 12 నుంచి 14 పార్లమెంట్ స్థానాలు గెలిచి దేశంలోనూ ఇండి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్‌, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు వైఫల్యాలే తమ విజయానికి కారణమవుతాయని బీఆర్‌ఎస్ విశ్వాసం వ్యక్తం చేసింది. గెలుపు తమదేనని ఆ పార్టీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు బీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచారని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు K.T.R స్పష్టం చేశారు. రెండు జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించామని.. అధిక ఎంపీ సీట్లు తమకే వస్తాయన్నారు. అధిక స్థానాల్లో ప్రజలు తమకు అనుకూలంగా తీర్పునిస్తారనిల బీజేపీ ఫూర్తి విశ్వాసంతో ఉంది. మోదీ ప్రధాని కావాలన్న దేశప్రజల కాంక్ష ముందు కాంగ్రెస్ కుయుక్తులు పని చేయలేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ వరంగల్‌లో విశ్వాసం వ్యక్తం చేశారు. 2నుంచి 3లక్షల మెజార్టీతో గెలుస్తామని మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డి.కె.అరుణ ధీమాగా తెలిపారు. నెలరోజులుగా ఎన్నికల ప్రచారాలతో బిజీ జిబీగా ఉన్న నాయకులు.. ఇప్పుడు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌.. మేనల్లుడితో కలిసి రిలాక్స్‌ అవుతున్నారు. మారథాన్‌లాంటి ప్రచారం తర్వాత ఫ్యామిలీ టైమ్‌ అంటూ సంజయ్‌ ట్వీట్‌ చేశారు

Tags

Next Story