SUMMER: రాష్ట్ర విపత్తుగా వడదెబ్బ

X
By - Sathwik |15 April 2025 1:28 PM IST
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వడ దెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో వడదెబ్బకు గురై మృతి చెందిన వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించనుంది. వరదలు, భూకంపాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మరణించిన వారికి సాధారణంగా ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు. ఇప్పుడు వడదెబ్బ తగిలి మరణించిన వారికి కూడా ఇవ్వనున్నారు. ఈ రెండు నెలలు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com