KCR Press Meet : తెలంగాణకు కేసీఆర్ ఏం చేశాడనేది మూర్ఖపు ప్రశ్న, జోక్ ఆఫ్ ది మిలీనియం

KCR Press Meet : KCR Press Meet : తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా రెండోసారి మీడియా ముందుకు వచ్చారు. మరోసారి కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. అందులోని ముఖ్యమైన పాయింట్స్ ఇవి..!
గట్టిగా నిలదీస్తే, ప్రజల పక్షాన అడిగితే దేశద్రోహా?
ఇంకా గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటారు
బండి సంజయ్ వడ్ల గురించి తప్ప సొల్లు పురాణం మాట్లాడారు
ఎవరి మెడలు ఎవరు వంచుతారు?
బిల్లులకు పార్లమెంట్‌లో మద్దతిచ్చినప్పుడు కేసీఆర్ దేశద్రోహి కాదా?
అబద్ధాలుపై బతికే పార్టీ బీజేపీ
ఇప్పటికైనా ధాన్యం ఎంత కొంటారా చెప్పండి
తెలంగాణ వడ్లను కొంటారా..లేదా?
సమాధానం చెప్పేదాకా బీజేపీని వదిలిపెట్టం
కేంద్రం నీతేంటో బయటపడాలి
రాయలసీమకు వెళ్లి సీమకు నీళ్లు కావాలని నేను చెప్పింది నిజం..
సీమకు నీళ్లు ఇస్తామంటే ఎవరు వద్దన్నారు?
బేసిన్లు, భేషజాలు మాకు లేవని చెప్పాం..
రెండు రాష్ట్రాల అవసరాలు తీరాక నీళ్లు బయటకు తీసుకెళ్లొచ్చు
పక్క రాష్ట్రానికి వెళ్లి చేపల పులుసు తింటే తప్పా?
నేను అడిగిందేంటి.. నువ్వు చెప్పిందేంటి?
వడ్లు పండించండి..కొనిపిస్తామన్నారు.. ఈ వ్యాఖ్యల నుంచి పారిపోయారా?
62 లక్షల హెక్టార్ల పంట ఉందా అని ప్రశ్నిస్తున్నారు..
6 హెలికాప్టర్లు పెడ్తాం.. మీ కేంద్రం అధికారులను తీసుకురండి
తెలంగాణ ఉద్యమం సమయంలో నువ్వున్నావా?
తెలంగాణకు ఏం చేసినవో చెప్పమంటున్నాడు ఈ మొగోడు..
సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి
గొర్ల పైసలు ఇచ్చామంటున్నారు.. నిరూపిస్తావా?
గొర్ల పైసలు మీరిచ్చారని తేలితే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తా
ఉచితాలతో ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నారని అంటున్నారు..
మేం ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నామా?
కర్నాటకలో దొడ్డిదారిన మీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు
మధ్య ప్రదేశ్‌లో దొడ్డిదారిని బీజేపీ సర్కార్ నడుస్తోంది
మ్యాండేట్ రాకున్నా కర్నాటకలో ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నారు?
మీరు లొంగి ఉండి.. చెప్పింది వింటే దేశభక్తులు..
మీరు చెప్పింది ఒప్పుకోకుంటే దేశద్రోహులు
ఈడీ, ఇన్‌కం ట్యాక్స్ రైడ్స్ బీజేపీ స్టైల్
బండి సంజయ్ ఒళ్లు దగ్గర పెట్టుకో జాగ్రత్త
మీ పిట్ట బెదిరింపులకు భయపడిపోం
దళిత సీఎంను చేయలేదు.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాం కదా..
దళిత సీఎంను చేయకపోవడానికి చాలా కారణాలున్నాయి
అడ్రస్ లేంది మీ పార్టీకి.. మా పార్టీకి కాదు
జీహెచ్‌ఎంసీలో మాకన్నా ఎక్కువ స్థానాలు గెలిచారా?
2001 నుంచి ఎన్నో ఎన్నికల్లో గెలిచాం
నేను ఎన్ని రాజీనామాలు చేశాను.. ఎక్కడెక్కడి నుంచి గెలిచానో తెలుసా?
తెలంగాణ బిల్లులో నేను ఓటు వేయలేదంటున్నారు..
అసలు అప్పుడు నీకు పార్లమెంట్ తెలుసా?
దేశంలో మీరు ఏ వర్గం ప్రజలకు మేలు చేశారు?
మేం ఎన్నో పరిపాలనా సంస్కరణలు తెచ్చాం
కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగుల్ని సర్దుబాటు చేస్తున్నాం
కొత్తగా 60-70 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం
ఏడాదికి కోటి ఉద్యోగాలిస్తామన్న కేంద్రం.. ఉన్న ఉద్యోగాల్ని తీసేసింది
నిరుద్యోగం తక్కువగా తెలంగాణలోనే ఉందని స్టడీస్ చెప్తున్నాయి
తెలంగాణకు కేసీఆర్ ఏం చేశాడనేది మూర్ఖపు ప్రశ్న, జోక్ ఆఫ్ ది మిలీనియం
తెలంగాణ పురోగతి బీజేపీ పాలిత రాష్ట్రమేదైనా సాధించిందా?
తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వెనక్కుపోయినప్పుడు అందరం రాజీనామా చేశాం
కిషన్ రెడ్డి మాత్రమే రాజీనామా చేయకుండా పారిపోయారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com